ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `పుష్ప ది రైజ్`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ గానే కాకుండా దేశ వ్యాప్తంగా వైరల్ గా మారిన ఈ మూవీ స్టార్ హీరో అల్లు అర్జున్ ని ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. తనతో పాటు సుకుమార్ ని కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా పాపులర్ అయ్యేలా చేసింది.
ఇక వరల్డ్ వైడ్ గా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఐదు భాషల్లో కలిపి రూ. 360 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. ఇందులో హిందీ బెల్ట్ నుంచి రూ. 100 కోట్లని రాబట్టడం విశేషం. సినిమాలోని బన్నీ పవర్ ఫుల్ డైలాగ్స్, టైటిల్ మేనరిజమ్స్, దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు.. ఇలా ప్రతీదీ వరల్డ్ వైడ్ గా వైరల్ అయ్యాయి.
దీంతో ప్రతీ ఒక్కరి దృష్టి ఈ మూవీపై పడింది. బాలీవుడ్ లో ఏకంగా ఈమూవీపై పెద్ద చర్చే నడిచింది. ఎలాంటి ప్రచారం చేకుండా 100 కోట్లు రాబట్టడం ఏంటని బాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
ఈ మూవీ రిలీజ్ తరువాత హీరో అల్లు అర్జున్ ముంబై వెళ్లారు. అక్కడ ప్రత్యేకంగా బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని కలిసి ఆయనతో కొంత సమయాన్ని గడిపారు. ఇది అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. బన్నీ బాలీవుడ్ డైరెక్టర్ ని ప్రత్యేకంగా కలవడం ఏంటీ? అని.. ఇద్దరూ కలిసి ఓ బారీ చారిత్రాత్మక మూవీని చేయబోతున్నారని రక రకాలుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా బన్నీ - సంజయ్ లీలా భన్సాలీని ప్రత్యేకంగా ముంబైలో ఎందుకు కలిశారో.. దాని వెనక ఏం జరగిందో తాజా గా బన్నీ సన్నిహిత వర్గాల ద్వారా ఓ ఆసక్తికరమైన అంశం బయటికి వచ్చింది.
`పుష్ప` మూవీని చూసి ఫిదా అయిన సంజయ్ లీలా భన్సాలీ వెంటనే బన్నీని కలవాలనుకున్నారట. అదే సమయంలో బన్నీ ముంబై వెళ్లడంతో తనని ప్రత్యేకంగా తన ఆఫీస్ కి ఆహ్వానించిన సంజయ్ లీలా భన్సాలీ తనతో మాట్లాడారట. పుష్పలో నటనకు బన్నీని ప్రత్యేకంగా అభినందించారట. ఇదే సమయంలో `గంగూబాయి కతియావాడీ` మూవీ గురించి కూడా బన్నీ సంజయ్ లీలా భన్సాలీని అభినందించారట.
అంతే కానీ ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ చేయడానికి కలవలేదని తెలిసింది. అయితే వీరిద్దరూ కలిసి సినిమా చేస్తారా? లేదా అన్నది మాత్రం టైమ్ డిసైడ్ చేయాల్సిందే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.