బాలీవుడ్ గత కొంత కాలంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి తమ సినిమాలతో రికార్డులు సృష్టించిన స్టార్స్ కూడా చేతులెత్తేయడంతో బాలీవుడ్ ని ఆదుకునే వాడే లేడా? అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో విడుదలైన `బ్రహ్మాస్త్ర` కొత్త ఆశలు చిగురించేలా చేసింది. యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్నా వసూళ్ల పరంగా బాలీవుడ్ కు కొత్త ఊపరి పోసిందని చెప్పాలి. అచితే ఆ తరువాత ఆ స్థాయిలో ఏ సినిమా కూడా ఆకట్టుకోలేకపోతోంది.
దీంతో బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని గమనించిన కొంత మంది స్టార్స్ తమ సినిమాలని డైరెక్ట్ గా ఓటీటీలోకి వదులుతున్నారు. విక్కీ కౌశల్, కియారా అద్వానీ, భూమి ఫడ్నేకర్ కలిసి నటించిన `గోవింద నామ్ మేరా` డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఓ రీమేక్ మూవీతో ధైర్యంగా థియేటర్లోకి వచ్చేశాడు అజయ్ దేవ్‌గన్.
కరోనా తరువాత ఓటీటీల వినియోగం భీభత్సంగా పెరిగిపోయిన ఈ నేపథ్యంలో ఏ భాషలో హిట్ సినిమా విడుదలైనా వెంటనే తెలిసిపోతున్న ఈ రోజుల్లో రీమేక్ లకు కాలం చెల్లిన విషయం తెలిసిందే. ఈ విషయం రీసెంట్ గా విడుదలైన `గాడ్ ఫాదర్` తో స్పష్టమైంది. దీంతో రీమేక్ సినిమా చేయాలంటే చాలా మంది భయపడుతున్న నేపథ్యంలో అజయ్ దేవ్ గన్ దక్షిణాదిలో సూపర్ హిట్ అనిపించుకున్న `దృశ్యం 2`ని హిందీలో రిమేక్ చేశాడు. ఇదే సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ఏడాది క్రితం విడుదలైన సినిమాకు రీమేక్ కావడంతో ఈ మూవీని ఉత్తరాది ప్రేక్షకులు ఆదరించడం కష్టమనే కామెంట్ లు వినిపించాయి. అయితే ఆ కామెంట్ లకు విరుద్ధంగా ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ అనూహ్యంగా మంచి ఓపెనింగ్స్ ని రాబట్టి అందరి అంచనాల్ని తలకిందులు చేసింది. పబ్లిక్ డిమాండ్ మేరకు ఈ మూవీని అర్థ్రరాత్రి ఒంటగంటకు కూడా షో వేశారంటే ఈ సినిమాపై ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా వున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఊహించని విధంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ తొలి రోజే రూ. 15. 38 కోట్ల గ్రాస్ ని రాబట్టడం విశేషం. ఫస్ట్ డే `భూల్ బులాయా 2`రూ. 14.11 కోట్లు వసూళ్లని రాబడితే బాలీవుడ్ అంతా పండగ చేసుకుంది. ఆ రికార్డ్ ని అధిగమించి `దృశ్యం 2` తొలి రోజే రూ. 15. 38 కోట్ల గ్రాస్ ని రాబట్టడంతో రానున్న రోజుల్లో ఈ మూవీ మరిన్ని రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టనుందని తెలుస్తోంది. అదే జరిగితే బాలీవుడ్ ఊపరి పీల్చుకోడవ ఖాయం అని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.