బ్రహ్మాస్త్ర... ఎలా చూసినా కష్టమే అంటున్నారు!

Update: 2022-09-05 03:48 GMT
బాలీవుడ్‌ లో రూపొందిన బ్రహ్మాస్త్ర పార్ట్‌ 1 శివ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపుగా అయిదు ఆరు సంవత్సరాలుగా ఈ సినిమా బాలీవుడ్‌ మీడియాలో నానుతూ వస్తోంది.

కరణ్ జోహార్ తో పాటు ప్రముఖ నిర్మాణ కంపెనీలు ఈ సినిమా నిర్మాణం లో భాగస్వామ్యం అయ్యాయి. అద్భుతమైన విజువల్ వండర్ అన్నట్లుగా ఈ సినిమా ఉండబోతుందని.. ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌ పీరియన్స్ ను ఇవ్వడం ఖాయం అంటూ యూనిట్‌ సభ్యులు ధీమాగా ఉన్నారు.

బ్రహ్మాస్త్ర సినిమా కు రూ.400 కోట్ల కు పైగా ఖర్చు చేశారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ఇంత భారీ మొత్తం రికవరీ అనేది ఎంతవరకు సాధ్యం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్‌ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. మినిమం టాక్‌ దక్కించుకుంటే వసూళ్లు భారీగా నమోదు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అంతే కాకుండా సౌత్ లో కూడా భారీగా వసూళ్లు నమోదు చేస్తేనే బ్రహ్మాస్త్ర టార్గెట్ రీచ్ అవ్వడం సాధ్యం.

సినిమా యావరేజ్ టాక్ దక్కించుకోవడం.. లేదంటే ఒక మోస్తరుగా ఉందంటూ ప్రేక్షకుల నుండి టాక్ దక్కించుకోవడం వల్ల ఈ సినిమా కు ఫలితం ఉండకపోవచ్చు. కేవలం ఈ సినిమా బ్లాక్ బస్టర్‌ అయితేనే సినిమా కు పెట్టిన పెట్టుబడి రికవరీ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం.

బ్రహ్మాస్త్ర సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటు అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా భారీగా వసూళ్లు నమోదు చేస్తేనే బడ్జెట్‌ రికవరీ అయ్యి సేఫ్ ప్రాజెక్ట్‌ గా ఈ సినిమా మారుతుంది అంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ సినిమా ఫలితం ఎలా ఉంటుంది అనేది మాత్రం ఒక స్పష్టత రావడం లేదు.

ఈ సినిమా కోసం దర్శకుడు అయాన్ తన ప్రాణం పెట్టి వర్క్ చేస్తున్నాడని.. తప్పకుండా సినిమా ఒక అద్భుతమైన విజువల్ వండర్ అన్నట్లుగా ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు మొదటి నుండి చెబుతున్నారు. ఉత్తర భారతంలోనే కాకుండా సౌత్‌ ఇండియా నుండి మినిమంగా ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధిస్తేనే బ్రహ్మాస్త్ర యొక్క టార్గెట్‌ రీచ్‌ అయినట్లు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News