ప్రభాస్.. ఒకప్పుడు టాలీవుడ్ లో మాత్రమే స్టార్ హీరో. కానీ, ఎప్పుడైతే బాహుబలి విడుదలైందో అప్పుడే ఇంటర్నేషనల్ స్టార్ డమ్ ను సంపాదించుకుని పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. మన దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ప్రభాస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆయనకున్న క్రేజ్ ను బాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో వాడుకోవాలని చూశాడు. కానీ, అడ్డంగా బుక్కయ్యాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు రణబీర్ కపూర్. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం `బ్రహ్మాస్త్ర`. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రియల్ కపుల్స్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌని రాయ్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో భాగం అయ్యారు.
ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ స్టూడియోస్ మరియు స్టార్లైట్ పిక్చర్స్ బ్యానర్లపై హై బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం.. సెప్టెంబర్ 9న హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అట్టహాసంగా విడుదల కానుంది. సౌత్ భాషల్లో ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి సమర్పిస్తుండటం విశేషం. ఇకపోతే రిలీజ్ డేట్ కు చాలా సమయం ఉన్నప్పటికీ మేకర్స్ అప్పుడే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేశారు.
ఇందులో భాగంగానే చిత్రం టీమ్ నిన్న వైజాగ్లో సందడి చేసింది. మెలోడీ థియేటర్ లో ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ మీట్ లో రణబీర్ కపూర్, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ , రాజమౌళి పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో రణబీర్ మాట్లాడుతూ.. తనకు సౌత్ సినిమాలంటే చాలా ఇష్టమని, సౌత్ సినిమాలకు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు.
అలాగే రజినీ సర్, కమల్ సర్, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా ఇక్కడ చాలా మంది తనకు స్నేహితులు ఉన్నారని.. అయితే, తనకు ఇష్టమైన వారిలో ఒకరిని ఎంచుకోవాలంటే, నేను ఖచ్చితంగా డార్లింగ్ ప్రభాస్ పేరే చెబుతానని, అందరి కంటే ప్రభాస్ ఎక్కువ ఇష్టమని రణబీర్ చెప్పుకొచ్చాడు.
దీంతో రణబీర్ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ప్రభాస్ అభిమానుల్లో ఓ వర్గం వారు రణబీర్ కామెంట్స్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నా.. మరికొందరు మాత్రం సెటైర్లు పేలుస్తున్నారు. గతంలో సౌత్ హీరోల గురించి పెద్దగా ఎప్పుడూ ప్రస్తావించని రణబీర్.. ఇప్పుడు తన సినిమాను ప్రమోట్ చేయడానికే అలా మాట్లాడాడని, ఇదొక మార్కెటింగ్ స్ట్రాటజీ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ పేరును అడ్డంపెట్టుకుని ఆయన అభిమానులను ఆకర్షించేందుకు రణబీర్ ప్రయత్నించాడని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.