తొలిముద్దు ఎంతటి మధురమైనదో అది అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆ అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇదే విషయాన్ని తాజాగా గుర్తు చేసుకుంది నాటి బాలీవుడ్ హీరోయిన్ పూజా భట్. తాను తొలిసారి తెరపై పెట్టిన ముద్దు గురించి మాట్లాడారు.
తాను పద్దెనిమిదేళ్ల వయసులో కెమెరా ముందు మొదటి సారిగా సంజయ్ దత్ ను ముద్దు పెట్టుకున్నట్టు చెప్పారు పూజా భట్. అప్పటికే సంజయ్ దత్ పెద్ద హీరో. సినిమా పోస్టర్లపై నిత్యం చూసే హీరోను నేరుగా ముద్దుపెట్టుకోవడం ఆశ్చర్యమేసిందని చెప్పుకొచ్చింది.
అయితే.. ఆ వయసులో ముద్దు పెట్టుకోవడానికి ఇబ్బంది పడ్డట్టు గుర్తు చేసుకుంది. ఈ సమయంలో తన తండ్రి ఇచ్చిన సలహాను పాటించానని చెప్పింది పూజా. ఈ సీన్ విషయంలో తండ్రి మహేష్ భట్ సపోర్టు చేసినట్టు తెలిపింది. ‘నువ్వు అసభ్యకరంగా ఫీలయ్యావంటే ఆ సీన్ తెరపై చూసేవారికి వల్గర్ గానే కనిపిస్తుంది’’ అని చెప్పారట మహేష్ భట్.
దీంతో.. అసలు విషయం అర్థం చేసుకొని చక్కగా ముద్దుసీన్లో నటించినట్టు చెప్పింది పూజా. ఆ విధంగా సినిమాల గురించి తాను నేర్చుకున్న తొలి పాఠం అదేనని చెప్పింది పూజా భట్.