చూడండోయ్..సినీతారలు షికారులు చేసే కారులు..

Update: 2020-04-18 00:30 GMT
భారతీయ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ కార్లతో తమ లగ్జరీని ప్రదర్శిస్తుంటారు. ఆ వరుసలో మాధురి దీక్షిత్ - జూహి చావ్లా - రవీనా టాండన్ - కాజోల్ మొదలైన వారందరూ విలాసవంతమైన కార్లను ఉపయోగిస్తున్నారు. సిటీలో తిరగడానికి - పార్టీలకు వెళ్లడానికి వారి కార్లను ఉపయోగిస్తారు.

ముందుగా ప్రముఖ హీరోయిన్ గా పేరుగాంచిన వారిలో జుహి చావ్లా ఒకరు. ఆమె 1988 సంవత్సరంలో అమీర్ ఖాన్ సరసన 'ఖయామత్ సే ఖయామత్ తక్' చిత్రంతో వెండితెర పై మెరిసింది. అంతే కాకుండా 1984లో మిస్ ఇండియా విజేతగా నిలిచింది. జుహి చావ్లాకి విలాసవంతమైన కార్లంటే కూడా చాలా ఇష్టమట. ఆమెకు చాలా ఇష్టంమైన కార్ జాగ్వార్.

హీరోయిన్ రవీనా టాండన్. సల్మాన్ ఖాన్ సరసన 'పత్తర్ కే ఫూల్' చిత్రంతో 'రవీన్ టాండన్' ఇండియన్ సినిమాల్లోకి అడుగుపెట్టింది. మోహ్రా - దిల్‌ వాలే - లాడ్లా - ఖిలాడియన్ కా ఖిలాడి ఇలా మరెన్నో సినిమాలు ఆమెకు అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈమె మెర్సిడెస్ బెంజ్ జిఎల్ ఎస్ 350 - జాగ్వార్ ఎక్స్‌ జె వంటి లగ్జరీ కార్లను ఉపయోగిస్తుంది.

కరిష్మా కపూర్. ఈమె ప్రేమ్ ఖైదీ చిత్రంతో బాలీవుడ్ పరిశ్రమలో నటిగా అడుగుపెట్టింది. కరిష్మా నటనా జీవితంలో రొమాంటిక్ మూవీ'రాజా హిందుస్తానీ'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కరిష్మా కపూర్ ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్ 2 ఎస్‌ యూవీ కార్ ఉపయోగిస్తుంది.

శిల్పాశెట్టి. భారతీయ సినిమాలలో చాలా ప్రసిద్ధి చెందింది. ఈమె 'సెలెబ్రిటీ బిగ్ బ్రదర్ 5' విజేత - శిల్పాశెట్టి మెయిన్ ఖిలాడి తు అనారి - హత్కాడి - ధడ్కాన్ మరియు మరిన్ని సినిమాల్లో నటించినందుకు పలువురి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. శిల్పా శెట్టి తన గ్యారేజీలో విలాసవంతమైన బిఎమ్‌ డబ్ల్యూ ఐ 8 - బిఎమ్‌ డబ్ల్యూ 7 సిరీస్ - బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ - రేంజ్ రోవర్ స్పోర్ట్‌ కార్లు కలిగి ఉంది.

కాజోల్. దిల్‌ వాలే దుల్హానియా లే జయేంగే - కుచ్ కుచ్ హోతా హై - కబీ ఖుషి కబీ ఘామ్ - ఫనా - మై నేమ్ ఈజ్ ఖాన్ వంటి పెద్ద హిట్‌ లను సాధించింది. పద్మశ్రీ - ఫిల్మ్‌ ఫేర్ అవార్డుల గ్రహీత - కాజోల్ 1993లో బాజీగర్ చిత్రంతో మంచి విజయాన్ని సాధించింది. కాజోల్ విలాసవంతమైన వోల్వో ఎక్స్‌ సి90 కారును ఉపయోగిస్తుంది.

మాధురి దీక్షిత్. ఇలకా - త్రిదేవ్ - ఖల్నాయక్ - కిషెన్ కన్హయ్య - సాజన్ - రాజా - దిల్ - బీటా మరియు మరెన్నో సినిమాల్లో నటించింది. మాధురి దీక్షిత్ ఆరు ఫిలింఫేర్ అవార్డులతో పాటు పద్మశ్రీ అవార్డు పొందింది. మాధురి దీక్షిత్ కి మెర్సిడెస్ మేబాచ్ ఎస్ 560లో ప్రయాణించడం అంటే చాలా ఇష్టమట. ఇటీవల డిజైన్ చేసిన టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివిని కూడా మాధురి ఉపయోగిస్తుంది.
Tags:    

Similar News