స్పెషల్‌ స్టోరి: హీరోయిన్‌లు.. అల్లాడిస్తున్నారు

Update: 2015-05-27 01:30 GMT
నాటిమేటి కథానాయికలు నటనకు ఆస్కారం ఉన్న చక్కని పాత్రల్లో నటించేవారు. పాతరోజుల్లో అలా సాగేది. కాలక్రమేణా కథానాయిక అంటే వీనులవిందు చేసే గ్లామర్‌ డాల్‌ అయిపోయింది. నాలుగు పాటలు, ఐదు సీన్లకు మాత్రమే పరిమితమవ్వాల్సొచ్చింది. అయితే రీసెంటుగా ట్రెండ్‌ మారింది. నాయికలే సినిమాని నడిపించేస్తున్నారు.

అసలు హీరోతో పనిలేకుండా కేవలం హీరోయిన్‌తోనే మార్కెట్‌లో కాసులు కురుస్తున్నాయి. నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాలు తీస్తూ బాక్సాఫీస్‌ని గడగడలాడించేసే రోజులొచ్చేశాయి. ఆ తరహాలో ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో కంగన, దీపిక పదుకొన్‌, ప్రియాంక చోప్రా, సన్నీలియోన్‌ లాంటి భామలు మెయిన్‌లీడ్స్‌లో నటిస్తూ బాక్సాఫీస్‌ ఫార్ములానే మార్చేశారు. సరికొత్త ట్రెండ్‌ సెట్‌ చేశారు.

ప్రియాంక నటించిన ఫ్యాషన్‌, మేరికోమ్‌ బాక్సాఫీస్‌ని రఫ్ఫాడించాయి. కేవలం తనని నమ్మి పెట్టుబడులు పెడితే చాలు. లాభాలు కళ్లజూడొచ్చు అన్న నమ్మకాన్ని చోప్రాగాళ్‌ ఇచ్చింది. అలాగే కంగన రనౌత్‌ నటించిన 'తను వెడ్స్‌ మను పార్ట్‌ 1, పార్ట్‌ 2, క్వీన్‌ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అయ్యాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. దీపికపదుకొన్‌ తనదైన ఛరిష్మాతో బాలీవుడ్‌ని ఏల్తోంది. ఈ భామ కనిపిస్తే చాలు కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. ఆ స్పీడ్‌తోనే హీరోలకు ధీటుగా నటించి.. చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌, రామ్‌లీల వంటి సినిమాల్ని తనదైన ఛరిష్మాతో హిట్టెక్కేలా చేయగలిగింది డిప్స్‌. లేటెస్టుగా పికు సినిమాలో లీడ్‌ పాత్రలో చెలరేగి మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని తనని నమ్మిన దర్శకనిర్మాతలకు అందించింది.

ఇదే తీరుగా పోర్న్‌ ప్రపంచం నుంచి వచ్చి బాలీవుడ్‌ని ఏల్తున్న నాయిక సన్నీలియోన్‌.. రాగిణి ఎమ్మెమ్మెస్‌, ఏక్‌ పహేలీ లీలా సినిమాలతో బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ కొట్టింది. సన్నీ కేంద్రకంగా సినిమాల్ని తీసేవాళ్లు కోకొల్లలు ఉన్నారిప్పుడు. సోనమ్‌కపూర్‌ (ఖుబ్‌సూరత్‌), అనుష్క శర్మ (ఎన్‌హెచ్‌ 10) సైతం బాక్సాఫీస్‌ని గడగడలాడించిన నాయికలుగా పేరు తెచ్చుకున్నారు. అంతకంటే ముందే రాణీముఖర్జీ, మాధురి ధీక్షిత్‌, శ్రీదేవి వంటి నాయికలు ఇలా కేవలం తమ ఛరిష్మాతో బాక్సాఫీస్‌పై ప్రభావం చూపించగలిగేవారు.

ఇక త్వరలో రానున్న ప్రియాంక చోప్రా 'గంగాజల్‌ 2', సోనాక్షి సిన్హా అకీర, సోనమ్‌ కపూర్‌ నీర్జా ఇదే తరహాలో నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాలే. నాయికలే ఇప్పుడు బాక్సాఫీస్‌ కలశాన్ని నింపే ట్రెండ్‌ సెట్టర్స్‌.
Tags:    

Similar News