కామెంట్: బాలీవుడ్ బాక్సాఫీస్ అలా ఉందిలే

Update: 2017-12-24 04:30 GMT
పదేళ్ల క్రితం నుంచి ఇండియన్ సినిమా ఇండస్ట్రీల మార్కెట్ చాలా వరకూ పెరుగుతూ వస్తున్నాయి. మ్యాజిక్ చేసే దర్శకులు కూడా చాలా ఎక్కువవుతున్నారు. హీరోలు కూడా కొత్తగా ఉండే కథలకు మాత్రమే ఒకే చేస్తున్నారు. ఇక టెక్నాలజీ పరంగా కూడా తెరపై మాయజాలన్ని చూపిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు. దీంతో సినిమాలు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ రికార్డులను కొల్లగొడుతున్నాయి. ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ సినిమాలు చాలానే వచ్చాయి. కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా కలెక్షన్స్ ని అంతగా రాబట్టలేవు. అయితే కొన్ని సినిమాలు డిజాస్టర్ అని టాక్ తెచ్చుకున్నా కూడా మంచి కలెక్షన్స్ ని అందుకున్నాయి.

ముఖ్యంగా 2017లో 10 సినిమాలు ఊహించని విధంగా లిమిట్ మార్కెట్ ను దాటి ఇండియన్ బాక్స్ ఆఫీస్ పరువును నిలబెట్టాయి. షారుక్ సల్మాన్ వంటి నటుల సినిమాలు ప్రతి ఏడాది 200 కోట్లకు పైగా బిజినెస్ చేసేవి కానీ ఈ ఏడాది వారు 100 కోట్లతోనే సరిపెట్టుకున్నారు. సల్మాన్ ఖాన్ ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ట్యూబ్ లైట్ టాక్ పరంగా ఫెయిన్ అయినా రూ.121 కోట్లను అందుకుంది. అయితే మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోన్న టైగర్ జిందా హై తో మాత్రం మళ్లీ సల్మాన్ ఫామ్ లోకి రాగలడని చెప్పవచ్చు. ఇక మరో ఖాన్.. షారుక్ సినిమా రయూస్ కూడా వంద కోట్ల సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ సినిమా రూ.131 కోట్లు సాధించగా మరో సినిమా జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌ మాత్రం ఈ ఖాన్ కి నిరాశను మిగిల్చింది.

ఇక అక్షయ్ కుమార్ కూడా ఈ ఏడాది రెండు సినిమాలతో వచ్చి రెండు వందల కోట్ల బిజినెస్ చేశాడు. జాలీ ఎల్‌ ఎల్‌ బీ 2 - టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ సినిమాలు టాక్ పరంగా కలెక్షన్స్ పరంగా మంచి సినిమాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇదే తరహాలో ఈ ఏడాది రెండు సినిమాలను రిలీజ్ చేసిన హీరో వరుణ్ ధావన్.. బద్రినాథ్‌ కీ దుల్హనియా రూ.116 కోట్లు కొల్లగొట్టగా మరో సినిమా జుడ్వా 2 రూ.205 కోట్లను అందుకుంది. ఈ సినిమా తెలుగు హలో బ్రదర్ కి రీమేక్. ఇక హృతిక్ కాబిల్ సినిమా ఫెయిల్ అయినా కూడా రూ.127 కోట్ల కలెక్షన్స్ ని చూసింది. సినిమా కథ రొటీన్ అయినా హీరో హీరోయిన్ చూపు లేని వారిగా కనిపించి నటనతో అందరిని మెప్పించారు.

ఇక రీసెంట్ గా వచ్చిన గోల్ మాల్ ఎగైన్ ఈ ఏడాది బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చిత్రాల్లో టాప్ ప్లేస్ ను దక్కించుకుంది. ఆ సినిమా రూ.205  కోట్ల మార్క్ ను దాటింది. ఇక అసలైన బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన ఏకైక చిత్ర బాహుబలి 2. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ - రానా - అనుష్క నటించిన సంగతి తెలిసిందే. మొదటి సారి ఇండియన్ సినిమాలకు 1000కోట్ల మార్కెట్ ఉంటుందని బాహుబలి 2 నిరూపించింది. అదికూడా టాలీవుడ్ చిత్రపరిశ్రమలో నుంచి ఆ సినిమా రావడం మరోక స్పెషల్. మొత్తానికి ఈ ఏడాది 100 కోట్ల నుంచి 100 కోట్ల వరకు బాలీవుడ్ సినిమాలు రికార్డ్ సృష్టించాయి. చివరగా బాద్షాహో సినిమా కూడా 80 కోట్లు దాటి పరవాలేదు అనిపించింది.
Tags:    

Similar News