రేప్‌ లు, మర్డర్లు ..ఇవే బాలీవుడ్‌ కథలు

Update: 2015-08-31 13:46 GMT
కొన్ని సినిమాలు రియల్‌ లైఫ్‌ స్టోరీస్‌ తో తెరకెక్కించి సంచలనాలకు కారణమయిన సందర్భాలున్నాయి. రేప్‌ లు, మర్డర్ లు ఆధారంగా ఇప్పటికే డజను పైగానే సినిమాలు తెరకెక్కాయి. అవేంటో ఆరాతీస్తే..

భన్వరిదేవి హత్య:
రాజస్తాన్‌ కి చెందిన భన్వర్‌ దేవి హత్యోదంతం కథతో డర్టీ పాలిటిక్స్‌ తెరకెక్కింది. ఈ హత్యలో రాజస్తాన్‌ కి చెందిన పలువురు రాజకీయనేతలకు సంబంధాలున్నాయని వినిపించింది. ఎమ్మెల్యే లు, ఎంపీలు ఇన్వాల్వ్‌ అయ్యారన్న వార్తలొచ్చాయి. మల్లికా శెరావత్‌ టైటిల్‌ పాత్ర పోషించింది.

ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ (2012):
ఈ ఉదంతంపై బోలెడన్ని సినిమాలొచ్చాయి. ఢిల్లీలోని పారామెడికల్‌ స్టూడెంట్‌ బోయ్‌ ఫ్రెండ్‌ తో కలిసి ఓ బస్‌ లో శికారు వెళ్లినప్పుడు ఈ గ్యాంగ్‌రేప్‌ జరిగింది. ది జర్నీ ఆఫ్‌ లవ్‌ అండ్‌ ప్యాషన్‌, దామిని.. ది విక్టిమ్‌, ఆజ్‌ కీ ఫ్రీడమ్‌, ది ఇండియాస్‌ డాటర్‌ (డాక్యుమెంటరీ) తెరకెక్కాయి.

పార్క్‌ స్ట్రీట్‌ గ్యాంగ్‌ రేప్‌ (2013):
 బెంగాళ్‌ లో జరిగిన ఈ రేప్‌ అప్పట్లో సంచలనం అయ్యింది. కార్‌ లో వెళుతున్న ఓ ఆంగ్లో ఇండియన్‌ ఉమెన్‌ ని గ్యాంగ్‌ రేప్‌ చేశారు. దీనిపై 3 కన్య, పార్క్‌ స్ట్రీట్‌ పేరుతో రెండు సినిమాలు తెరకెక్కాయి.

స్కార్లెట్‌ కీలింగ్‌ మర్డర్‌ (2008)
గోవా బీచ్‌ లో ఓ విదేశీ వనిత రేప్‌, హత్య అంటూ అప్పట్లో సంచలనాత్మక న్యూస్‌ అయ్యింది. ఓ ఇద్దరు నిందితులు ఇప్పటికీ విచారణలో విలవిలలాడుతూనే ఉన్నారు. దీనిపై అంజునా బీచ్‌ పేరుతో సినిమా తెరకెక్కింది.
Tags:    

Similar News