పెళ్లాడేందుకు రెడీ అవుతుండగా.. 34 వయసుకే వర్థమాన హీరో సుశాంత్ సింగ్ మరణం ఊహించనిది. ఒక నటుడిగా ఇంతింతై అన్న చందంగా ఎదిగేస్తున్నాడు. ఈలోగానే ఈ దుర్వార్త. ఆత్మహత్యనా? హత్యనా? అన్నది ఇప్పటికి మిస్టరీనే.
అతడు ఆత్మహత్య చేసుకున్నాడని.. తీవ్రమైన ఒత్తిడితోనే ఇలా చేశాడని .. జీవితంలో అనుకున్నది సాధించలేదని తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నాడని రకరకాలుగా ప్రచారమై పోయింది. అయితే కుటుంబ సభ్యులు అభిమానులు మాత్రం అనుమానా స్పద మృతి అని ఆత్మహత్య కాదని అంటున్నారు. హత్య జరిగిందని సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతున్నారు.
సుశాంత్ మరణం సహా మరో ఇద్దరు నటులతో సేమ్ టు సేమ్త పోలిక ఉన్న ఒక పెద్దతెర సీన్ ఒకటి అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. సుశాంత్ నటించిన చిచ్చోరే ఆత్మహత్యలు తగదని సందేశం ఇచ్చిన సినిమా. ఇందులో ఓ సన్నివేశంలో సుశాంత్ కార్ లో ప్రయాణిస్తూ తల బయటికి పెట్టి నీలాకాశాన్ని తథేకంగా చూస్తుంటాడు. ఆ చూపులో ఏదో హృద్యమైన ఆవేదన కనిపిస్తుంది. ఆహ్లాదంగా ఉన్నా అంతరార్థం వేరేగా అనిపిస్తుంది. ఇటీవలే క్యాన్సర్ తో మరణించిన ఇర్ఫాన్ ఖాన్ సైతం అతడు నటించిన అంగ్రేజీ మీడియం చిత్రంలో ఇలాంటి సీన్ లో నటించాడు. కార్ లోంచి తల బయటికి పెట్టి ఆకాశాన్ని తథేకంగా చూస్తుంటాడు. అటు హాలీవుడ్ లో డార్క్ నైట్ సినిమాలో జోకర్ పాత్రధారి హీత్ లెడ్జర్ సైతం అనారోగ్యంతో రాంగ్ మెడిసిన్ తో మరణించారు. ఆయన కూడా కార్ లోంచి తల బయటికి పెట్టి చూసే దృశ్యంలో కనిపించాడు. డార్క్ నైట్ లోని ఆ సీన్ ఎంతో హృద్యంగా ఘాఢతతో ఆకట్టుకుంటుంది.
ఆ ముగ్గురు నటులు అనుకునే ఇలా చేశారా? చివరి సినిమాల్లో అలా కార్ లోంచి బయటికి తల పెట్టి చూడడమేమిటి? అంటూ సోషల్ మీడియాల్లో డిబేట్ సాగుతోంది. దీనిపై సుశాంత్ అభిమానులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే చిచ్చోరే సీన్ కి డార్క్ నైట్ సీన్ ఇన్ స్పిరేషన్ అయ్యి ఉండొచ్చు కదా? ఇర్ఫాన్ దర్శకుడికి అదే సన్నివేశం నుంచి స్ఫూర్తి పొంది రాసుకుని ఉండొచ్చు కదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.