హీరో సుశాంత్ సింగ్ మరణం ఎన్నో పాఠాల్ని నేర్పిస్తోంది. ఇండస్ట్రీకి వేనవేల ఆశలతో వచ్చే ఎందరో నవతరం స్టార్లు ఇక్కడ అంతా నిజం అనుకుంటే పొరపాటేనని అర్థమైంది. ముఖ్యంగా ఇక్కడ స్నేహాలు శాశ్వతం కాదని అవసరంలో ఏమాత్రం ఉపయోగపడవని ప్రూవైంది. ఇది ఈ ఆత్మహత్య నుంచి యూత్ నేర్వాల్సిన పాఠం అంటే అతిశయోక్తి కాదు.
సుశాంత్ పై పలువురు స్టైలిస్టులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత స్టైలిష్ట్ బావ్నా ఇంతకుముందు చేసిన వ్యాఖ్య ఇందుకు నిదర్శనం. సుశాంత్ కి సరైన స్నేహం లేదని సాయం అందలేదని ఆవిడ వ్యాఖ్యానించారు. ఇప్పుడు మరో ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ లీపాక్షి ఎల్లవాడి అదే తరహాలో వ్యాఖ్యానించడం ఆసక్తిని కలిగిస్తోంది. లీపాక్షి సుశాంత్‌కు చాలా మంచి స్నేహితురాలు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పరిశ్రమలో సుశాంత్ కి స్నేహితులెవరూ లేరు. అతడి వ్యక్తిత్వం ఎంతో అరుదైనది. తన స్కూల్ కాలేజ్ డేస్ స్నేహితులే తనతో ఉన్నారు. ఈ పరిశ్రమకు పనికిరాని వ్యక్తిత్వం అతనిది. ఇక్కడ ప్రతి దానికి ఒక చీకటి కోణం ఉంటుంది. చాలా మందికి నిజమైన స్నేహితులు ఇక్కడ ఉండరు. మార్గ నిర్దేశం చేసే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు తెలిసినంతవరకు, అతనికి సాధారణ నేపథ్యం నుండి వచ్చిన స్నేహితులు ఉన్నారు`` అని తెలిపారు.
యుక్తవయసులో సుశాంత్ తన తల్లి ని కోల్పోయాడు. లీపాక్షి తన తల్లిని కోల్పోయారు. ఇది ఇద్దరిని బాగా కలిపింది. M.S. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ విడుదల సమయంలో నేను భారతదేశం లో లేనని.. పెద్ద తెరపై మాత్రమే సినిమాలు చూడటానికి ఇష్టపడతానని తనతో చెప్పాను. నా ఇంటికి రండి.. అంటూ భారీ ప్రొజెక్టర్ తెచ్చి పెద్ద స్క్రీన్‌లలో సినిమా చూపించాడు అంటూ గతానుభవాన్ని స్ఫురణకు తెచ్చుకున్నారు లీపాక్షి. ``కొన్నిసార్లు అతను అధికంగా మాట్లాడేవాడు. నేను టాపిక్ కట్ చేసి..సైలెంట్ అనేసేదానిని. అలాగని మా మధ్య చాలాకాలంగా స్నేహం లేదు. కానీ అతనితో ఎంతో సౌకర్యంగా ఉంటుంది`` అని తెలిపారు.
సుశాంత్ ఏదైనా కార్యక్రమానికి లేదా అవార్డు షోలకు హాజరవుతున్నాడా? అని ఆరాతీసి స్టైలింగ్ కి సాయపడేదానిని అని లీపాక్షి తెలిపారు. అతడు చాలా కార్యక్రమాలకు వెళ్ళకుండా సిగ్గుపడతాడు. అది సరికాదని తెలుసుకున్నాడు. అది తలచుకుని నవ్వుకునేవాళ్లం`` అని ఆమె చెప్పింది.
మాటల్లో తన మాజీ ప్రేయసి అంకిత లోఖండేవాలా గురించి చాలా చెప్పేవాడు. ఎనిమిదేళ్ల ప్రేమాయణం వారిది. టీవీ పరిశ్రమలో తాను కష్ట కాలంలో ఉన్నప్పుడు ఆమె తనకు చాలా మద్దతు ఇచ్చిందని తెలిపారు. పెద్ద స్టార్ అయ్యాక .. తనతో బ్రేకప్ అయినా మంచి విషయాలు మాత్రమే చెప్పేవాడు! అంటూ లీపాక్షి ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.