ఒకప్పుడు సౌత్ సినిమాల గురించి బాలీవుడ్ స్టార్స్ కనీసం పట్టించుకునే వారు కాదు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా సౌత్ సినిమాల గురించి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించే వారు కాదు. సౌత్ సినిమాలు ఉత్తరాదిన డబ్ చేసేందుకు కూడా ఎవరు ఆసక్తి కనబర్చేవారు కాదు. అలాంటి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. హిందీ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా బడ్జెట్ విషయంలో ఇంకా కంటెంట్ విషయంలో సౌత్ సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ కారణంగా సౌత్ సినిమాలను అక్కడ డబ్ చేసేందుకు లేదా రీమేక్ చేసేందుకు ఒక వర్గం నిర్మాతలు ఎప్పుడు సిద్దంగా ఉంటున్నారు.
ఇప్పటికే పలు తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అయ్యి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం కూడా పలు తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్నాయి. కొన్ని తెలుగు సినిమాలు హిందీ రీమేక్ కోసం చర్చలు జరుపుతున్నారు. తాజాగా మత్తు వదలరా చిత్రంను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ ఈ చిన్న చిత్రం రీమేక్ రైట్స్ ను దక్కించుకుంది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ గా కూడా ఒక మోస్తరులో ఆడిన ఈ చిత్రం కథ బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.
కీరవాణి తనయుడు సింహా నటుడిగా పరిచయం అయిన ఈ సినిమాకు రితేష్ రానా దర్శకత్వం వహించాడు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం రీమేక్ ను మొదలు పెట్టే విషయమై చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే హిందీ మత్తువదలరా డీటైల్స్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ రీమేక్ కు తెలుగు వర్షన్ కు దర్శకత్వం వహించిన రితేష్ రానా అక్కడ కూడా దర్శకత్వం వహించే అవకాశం ఉందని అంటున్నారు.