సౌత్ కథలను బాలీవుడ్ లో తెరకెక్కిస్తే మంచి హిట్ అందుకోవచ్చని అక్కడి టెక్నీషియన్స్ కి బాగా తెలుసు. కొంచెం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా బాలీవుడ్ స్టార్ హీరోలు టాలీవుడ్ కథలను రీమేక్ చేయాలనీ అనుకుంటారు. కొంచెం కెరీర్ డౌన్ అయినా కూడా తెలుగు కథలతో కొంత మంది హీరోలు రికవర్ అయ్యారు. ఇకపోతే కెరీర్ మంచి స్టేజ్ లో ఉన్నప్పటికీ రన్ వీర్ సింగ్ తెలుగు సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.
రోహిత్ శెట్టి దర్శకత్వంలో టెంపర్ కథను రన్ వీర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితమే స్టార్ట్ చేయాల్సిన ఈ సినిమా షూటింగ్ స్క్రిప్ట్ పనుల వల్ల ఆలస్యం అయ్యింది. మొత్తంగా సినిమా కథలో మెయిన్ ఇంపాక్ట్ లో తేడాలు రానివ్వకుండా నార్త్ జనాల టేస్ట్ కి తగ్గట్టు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. ఇక ఆ సినిమా మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే మొదలుపెట్టనుండడం స్పెషల్ అని చెప్పాలి.
రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని సీన్స్ తో సినిమా రెగ్యులర్ షూటింగ్ ని చిత్ర యూనిట్ స్టార్ట్ చేయనుంది. దర్శకుడు రోహిత్ శెట్టి టెంపర్ కథను ఎంతో ఇష్టంగా దక్కించుకున్నాడు. సెకండ్ ఆఫ్ లో సినిమాలో కంటెంట్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. అసలే నెగిటివ్ పాత్రలతో అబ్బురపరిచే రన్ వీర్ టెంపర్ క్యారెక్టర్ కి కరెక్ట్ గా న్యాయం చేస్తాడని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటిస్తుండగా కరణ్ జోహార్ సినిమాను నిర్మిస్తున్నాడు.