టాలీవుడ్ నుంచి బాలీవుడ్ పాఠం!

Update: 2022-10-04 23:30 GMT
టాలీవుడ్ అనుభ‌వాలు బాలీవుడ్ కి పాఠంగా మారాయా? ప‌రిస్థితి చేజార‌కుండా ముందే జాగ్ర‌త్త‌పడ‌టంతో బాలీవుడ్ సంక్షోభం నుంచి ముందే జాగ్ర‌త్త‌ప‌డిందా? అంటే అవున‌నే అనిపిస్తుంది. కోవిడ్ రాక‌తో అన్నిర‌కాల ఇండస్ర్టీలు ఆర్ధికంగా కుదేలైన సంగ‌తి తెలిసిందే. ఇందులో సినిమా రంగం కూడా ఉంది. సినిమాలు స‌క్ర‌మంగా రిలీజ్ కాక‌పోవ‌డం.. రిలీజ్ అయిన జ‌నాలు థియేట‌ర్ల‌కి వెళ్ల‌క‌పోవ‌డం..ఓటీటీకి అలవాటు ప‌డ‌టం..స‌క్సెస్ రేట్ ప‌డిపోవ‌డం వంటి స‌న్నివేశాల ప‌రిశ్ర‌మ‌లు ఆర్ధికంగా మ‌రింత సంక్షోభానికి గుర‌య్యాయి.

కాస్ట్ ఆఫ్ ప్రొడ‌క్ష‌న్ పెరిగిపోవ‌డం నిర్మాత‌ల‌కు మ‌రింత భారంగా  మారింది. అందులోనూ బాలీవుడ్ ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింది. టాలీవుడ్ కోలుకున్నా..బాలీవుడ్ ప‌రిస్థితి ఇంకా ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డ చందంగానే ఉంది. రెండున్న‌రేళ్ల‌గా స‌రైన విజ‌యం లేక స‌త‌మ‌త‌మ‌వుతోంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో టాలీవుడ్ ల హీరోల పారితోషికాల‌పై  నిర్మాత‌లు స‌మ‌ర‌శంఖం పూరించారు.

అగ్ర‌హీరోలంతా పారితోషికాలు త‌గ్గించాల‌ని ఎక్క‌డి షూటింగ్ లు అక్క‌డ నిలిపి వేసి బంద్ కి పిలుపునిచ్చారు. దీంతో హీరోలంతా దిగొచ్చి స్వ‌చ్ఛందంగా పారితోషికాలు త‌గ్గించుకున్నారు. నిర్మాత సంఘాలు హీరోల‌తో చర్చ‌లు జ‌రిపించి సానుకూల వాత‌వ‌ర‌ణంలో వాటిని ముగించారు. ఆ ర‌కంగా తెలుగు నిర్మాత‌లు కొంత వ‌ర‌కూ కోలుకో గ‌లిగారు.

అదే స‌మ‌యంలో ఈ ప‌రిస్థితులు అన్నింటిన బాలీవుడ్ ఎంతో నిశితంగా ప‌రిశీలించింది. నిర్మాత‌లు ఏ కార‌ణంగా బంద్ కు పిలుపునిచ్చారు? అన్న‌ది సంఘాల్ని అడిగి తెలుసుకున్నారు. అక్క‌డా ఇలాంటి ప్ర‌ణాళిక‌కు రంగం సిద్ద‌మ‌వుతొంద‌న అప్పుడే బాలీవుడ్ మీడియా లో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అయితే స‌న్నివేశం అంత దూరం వెళ్ల‌కుండానే చాలా మంది హీరోలు స్వ‌చ్ఛందంగానే పారితోషికాలు త‌గ్గించుకున్నారు.

అక్ష‌య్ కుమార్..ఆయుష్మాన్ ఖురానా...అజ‌య్ దేవ‌గ‌ణ్ లాంటి టైర్ -2 హీరోలు చాలా మంది త‌మ‌కు తాముగా మందుకొచ్చి భారీగా పారితోషికంగా త‌గ్గించుకున్నారు. రెగ్యుల‌ర్ గా తీసుకునే పారితోషికంలో దాదాపు 50 శాతం కోత పెట్టారు. టైర్ వ‌న్ హీరోలు కొంత‌మంది 20 శాతం వ‌ర‌కూ త‌గ్గించుకున్న‌ట్లు తెలిసింది. అయితే ఎవ‌రెవ‌రు? త‌గ్గించుకున్నారు? అన్న‌ది బ‌యట‌కు రాలేదు.

హీరోల  మార్కెట్ పై ప్ర‌భావం ప‌డుతుంది అన్న కార‌ణంగా త‌గ్గించుకున్నా?  మీడియా ముందు ఓపెన్ అయింది లేదు. మొత్తానికి బాలీవుడ్ ఈ ర‌క‌మైన మార్పు మంచిదే. పెరిగిపోతున్న కాస్ట్ ఆప్ ప్రొడ‌క్ష‌న్ కి ఈ ర‌కంగా కొంత వెసులుబాటు దొరికింది.  హిట్ అయితే 100 కోట్లు తెచ్చే సినిమా...ఫ‌ట్ అయితే 10 కోట్లు తేవ‌డం కూడా క‌ష్ట‌మ‌వుతుంది. బ‌డ్జెట్ మాత్రం యధావిధిగా ఖర్చు చేయాల్సి వ‌స్తోంది. అందుకే నిర్మాత‌లు క‌మిట్ అయ్యే ముందు క‌థ‌ల ప‌ట్ల  జాగ్ర‌త్త వ‌హించాల‌ని.. కాంబినేష‌న్స్ క‌న్నా క‌థ‌ల్ని న‌మ్మి వెళ్లండ‌ని... గుడ్డిగా ముందుకెళ్లొద్ద‌ని అనుభ‌వ‌జ్ఞులు సూచిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News