బన్నీ సినిమాలో పవన్ తాత!!

Update: 2017-04-18 05:29 GMT
హరీష్ శంకర్ దర్శకత్వంలో.. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న డీజే-దువ్వాడ జగన్నాధం షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. సమ్మర్ టైం.. ఏప్రిల్ ప్రారంభంలో అల్లు అర్జున్- కొడుకు అల్లు అయాన్ పుట్టినరోజులు.. బన్నీకి స్కిన్ ఎలర్జీ.. ఇలాంటి రకరకాల కారణాలతో.. డీజే షూటింగ్ కి ప్రస్తుతం కొంత బ్రేక్ పడింది. క్లైమాక్స్ ను రీరైట్ చేస్తున్నారనే టాక్ కూడా ఉంది.

అయితే.. మరో వారం పది రోజుల షెడ్యూల్ తో డీజే షూట్ పూర్తయిపోతుంది. ఆ తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు అల్లు అర్జున్. బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం కాగా.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇప్పటికే వచ్చేసింది. ఇప్పుడీ చిత్రానికి క్యాస్టింగ్ ను కంప్లీట్ చేస్తున్నారు. ఈ మూవీలో ఓ కీలక పాత్రకు బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీని తీసుకున్నారు బన్నీ అండ్ టీం. పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేదిలో.. పవన్ కు తాతగా నటించి మెప్పించిన బొమన్ ఇరానీ.. ఆ తర్వాత బెంగాల్ టైగర్ చిత్రంలో కూడా కనిపించారు.

నా పేరు సూర్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్న ఈ చిత్రంలో.. బొమన్ ఇరానీ పాత్ర చాలా కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. గత చిత్రాల కోసమే స్పెషల్ ట్యూషన్ పెట్టించుకుని మరీ తెలుగు మాట్లాడడం ప్రాక్టీస్ చేశారు బొమన్ ఇరానీ. ఇప్పుడు బన్నీ సినిమాలో చేయనున్న పాత్ర.. టాలీవుడ్ లో ఈయనకు మరో ల్యాండ్ మార్క్ గా నిలిచిపోనుందనే టాక్ వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News