దేశం మొత్తాన్ని కుదిపేసిన శ్రీదేవి మరణం గురించి ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తను ఎలా చనిపోయింది అనే దాని గురించి ప్రాధమిక సమాచారం ఉన్నప్పటికీ దాన్ని అధిక శాతం అభిమానులు నమ్మడం లేదు. జరిగింది దుబాయ్ లో కనక మీడియా సైతం పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టడంలో విఫలమైంది. ఈ నేపధ్యంలో అసలు ఆ రాత్రి ఏం జరిగింది అనే దాని గురించి ఒక్క బోనీ కపూర్ కు మాత్రమే తెలుసన్నది నిజం. ప్రముఖ ఫిలిం అనలిస్ట్ కోమల్ నెహతాతో అప్పటి సంఘటన గురించి బోనీ పర్సనల్ గా షేర్ చేసుకున్నాడు. గతంలో తెలిసిన వెర్షన్ లాగే అనిపిస్తున్నా ఇందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
శ్రీదేవి మృతి చెందిన రోజు మధ్యాన్నం దాకా బోనీ కపూర్ ఇండియాలోనే ఉన్నాడు. అంతకు ముందు రోజు వరకు అక్కడే ఉన్న బోనీ ఒక ముఖ్యమైన మీటింగ్ కోసం ముంబైకు తిరిగి వచ్చాడు. 24వ తేది ఉదయం ఫోన్ లో శ్రీదేవితో మాట్లాడిన బోనీ తనను ఎంత మిస్ అవుతుందో అర్థం చేసుకుని సడన్ సర్ప్రైజ్ ఇచ్చే ప్లాన్ తో సాయంత్రం అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. ధడక్ షూటింగ్ లో ఉన్న జాన్వీ కూడా నాన్నను వెళ్ళమనే ఒత్తిడి చేసింది. అమ్మ ఏకాంతంగా ఉంటే ఏమరుపాటుగా పాస్ పోర్ట్ మర్చిపోవడం లాంటివి చేస్తుందని అందుకే వెళ్ళమని చెప్పడంతో బోనీ మరో ఆలోచన చేయకుండా వెళ్ళాడు.
సాయంత్రం ఆరున్నర సమయంలో శ్రీదేవి బస చేస్తున్న హోటల్ రూమ్ 2201కు చేరుకున్న బోనీని చూసి శ్రీదేవి షాక్ అవ్వలేదు. ఇలా బోని ప్రేమ చూపించడం శ్రీదేవికి అలవాటే కనక డిన్నర్ కోసం బయటికి వెళ్ళడానికి స్నానం చేయడానికి బాత్ రూమ్ వెళ్ళింది. ఈ లోపు ప్రయాణపు బడలికతో ఉన్న బోనీ కాసేపు టీవీలో ఇండియా-దక్షిణాఫ్రికా ఫైనల్ ట్వంటీ ట్వంటీ తో పాటు పాకిస్తాన్ క్రికెట్ లీగ్ హై లైట్స్ చూసుకుంటూ టైం గడిపాడు. ఇరవై నిముషాలు అవుతున్నా శ్రీదేవి వస్తున్న జాడ లేకపోవడంతో బోనీ టీవీ సౌండ్ తగ్గించి బాత్ రూమ్ దగ్గరకు వెళ్లాడు. ట్యాప్ సౌండ్ తప్ప ఇంకేమి వినిపించడం లేదు. తలుపు తోస్తే ఓపెన్ అయ్యింది. లోపల శ్రీదేవి లాక్ చేసుకోకపోవడం వల్ల బోనీకి విరగొట్టే అవసరం పడలేదు.
ఇంకేముంది గుండె చప్పుడు ఆగిపోయే షాక్. పీక్కల్లోతు టబ్బు నీటిలో నిర్జీవ స్థితిలో శ్రీదేవి తేలియాడుతూ ఉంది. కాళ్ళ కింద భూమి కదులుతున్న ఫీలింగ్ తో బోనీ శ్రీదేవిని ఒక్క ఉదుటన చేరుకున్నాడు. కాని అప్పటికే తను ఈ లోకం వదిలి వెళ్ళింది. ఇక తను ఎప్పటికి తిరిగి రాదు అనే నిజాన్ని అర్థం చేసుకోవడానికి బోనీకి ఎక్కువ సమయం పట్టలేదు. శాశ్వతంగా సెలవు తీసుకుంటూ బోనీని ఒంటరిగా మిగిల్చి వెళ్లిపోయింది. కాసేపట్లో కలిసి భోజనం చేస్తామని ఆశించిన బోనీ కపూర్ మరికాసేపట్లో తన పార్ధీవ దేహాన్ని మోయాల్సి రావడాన్ని మించిన విషాదం ఇంకేముంటుంది. ఇది బోనీ స్వయంగా వివరించిన ఆ రోజు రాత్రి తాలుకు విషాద జ్ఞాపకం.