భారతీయ సినీ చరిత్రలోనే శ్రీదేవి అంత పేరు తెచ్చుకున్న హీరోయిన్ మరొకరు లేరనే చెప్పాలి. రెండు నెలల కిందట ఆమె హఠాత్తుగా ప్రాణాలు వదిలి కోట్లాదిమందిని శోక సంద్రంలో ముంచేసింది. శ్రీదేవి ఈ తరహాలో లోకం విడిచి వెళ్లిపోతుందని ఎవ్వరూ అనుకోలేరు. శ్రీదేవి మీద జనాలకు ఎంత అభిమానం ఉందన్నది ఆమె చనిపోయినపుడే తెలిసింది. ఆమె మరణం నుంచి అభిమానులు కోలుకుని వాళ్ల వాళ్ల పనుల్లో పడిపోయి ఉంటారు. కానీ పాతికేళ్లుగా ఆమెతో జీవితాన్ని పంచుకుంటున్న బోనీకపూర్ పరిస్థితే చాలా బాధాకరంగా ఉంటుంది. ఇన్నేళ్లు శ్రీదేవితో కలిసి జీవించిన ఇంట్లో ఆమె లేకుండా ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. ఐతే ఈ విషాదం నుచి కోలుకుని తన భార్య మీద ఒక సినిమా తీయాలన్న సంకల్పంతో ఆయన అడుగులు వేస్తున్నట్లుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రం కోసం ఆల్రెడీ ఆయన కొన్ని టైటిళ్లు కూడా రిజిస్టర్ చేయించారట. ‘శ్రీ’.. ‘శ్రీదేవి’.. ‘శ్రీ మేడమ్’ అనే టైటిళ్లు ఆయన హిందీ ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేశారట. కేవలం ఈ టైటిళ్లనే కాదు.. గతంలో శ్రీదేవి నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల టైటిళ్లను కూడా బోనీ మరోసారి రిజిస్టర్ చేశారట. అందులో ‘చాలా బాజ్’.. ‘రూప్ కి చోరన్ కా రాజా’.. ‘జాన్ బాజ్’.. ‘మిస్టర్ ఇండియా’ లాంటి టైటిళ్లు ఉన్నాయట. ‘మిస్టర్ ఇండియా’కు కొనసాగింపుగా చేయాలనుకున్న ‘రిటర్న్ ఆఫ్ మిస్టర్ ఇండియా’ టైటిల్ కూడా బోనీ రిజిస్టర్ చేయించారట. శ్రీదేవికి గుర్తుగా ఈ టైటిళ్లను ఆయన రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. ఆమె పని చేసిన సినిమాల హక్కులన్నీ బోనీ తీసుకుంటున్నాడట. అలాగే ఆ చిత్రాల టైటిళ్ల హక్కుల్ని కూడా తీసుకుంటున్నాడట. ఇది శ్రీదేవికి ఆయన ఇచ్చే ట్రిబ్యూట్ అని సన్నిహితులు అంటున్నారు.