అతిలోక సుందరి ఎలా ఉంటుంది అంటే... ఖచ్చితంగా అందరూ చెప్పే ఒకే ఒక్క మాట... శ్రీదేవి... ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సినిమాల్లో శ్రీదేవి తన నట విశ్వ రూపంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసింది. అయితే అంతలా కట్టి పడేసిన ఆ అందం, ఎందరికో నిద్ర పట్టకుండా చేసిన ఆమె సౌందర్యం... తెలుగు ప్రేక్షకులకు ఆజన్మాంతం గుర్తు ఉండిపోయే ఆమె ఆభినయం అన్నీ మౌనంలో కలిసిపోయి దాదాపుగా ఏడాది గడుస్తుంది. 2018 లో ఫిబ్రవరి 24న ఆమె తుది శ్వాస విడవగా...ఆమె మనల్ని వదిలి ఇంకో రెండు రోజుల్లో ఏడాది పూర్తి కాబోతూ ఉండగా ఆమె అందరి గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయేలా ఒక నిర్ణయం తీసుకున్నారు ఆమె భర్త మరియు కుటుంభం.
ఆమె ఎప్పుడూ కట్టి నిండుగా కనిపించిన, ఆమె కట్టి అందం తెచ్చిన కోట చీరను బోణీ కపూర్ కుటుంభం ఆక్షన్ కి పెట్టింది. ఆ ఆక్షన్ లో భాగంగా ఈ చీరను తన అభిమానులకు అందజేయ్యాలి అన్నది వారి ప్రయత్నం. అయితే ఈ ఆక్షన్ వివరాల్లోకి వెళితే, 'పరిసెరా' అనే ఆన్‌లైన్ షూపింగ్ వెబ్ సైట్ ద్వారా ఈ చీరను వేలం పాట పెట్టారు బోణీ అండ్ ఫ్యామిలీ. ఇక చీర స్టార్టింగ్ రేట్ ను 40వేల వరకూ పెట్టారు....ఇక శ్రీదేవి పై అభిమానంతో 40,000 తో మొదలయిన ఈ వేలం, ఇప్పటికే 90,000 వేలకు చేరింది.
మరో పక్క ఈ చీరకు వచ్చిన డబ్బును సొంత ప్రయోజనాల కోసం కాకుండా అనాధ ఆశ్రమానికి ఇచ్చేలా ప్లాన్ చేశారు శ్రీదేవి కుటుంభ సభ్యులు. ఇక ఈ చీరను వేలం వెయ్యడానికి గల కారణం కూడా ఇది వేలం కాదు అని, ఆమెను ఆమె అభిమానులకు మరింత దగ్గర చేద్దాం అన్నది మా ఉద్దేశం అని అంటున్నారు శ్రీదేవి కుటుంభ సభ్యులు. మొత్తంగా చూసుకుంటే, శ్రీదేవిపై అభిమానంతో ఈ ఆక్షన్ ముగిసే లోపు భారీ రేట్ పలికేలా ఉంది అన్నది స్పష్టంగా చెప్పవచ్చు. మరి ఈ ఆక్షన్ ఎక్కడ ముగుస్తుందో...ఈ చీరను ఎవరు ఎంత రేట్ కి దక్కించుకుని శ్రీదేవిపై వారి అభిమానాన్ని చూపుతారో చూద్దాం.