'భీమ్లా నాయ‌క్` కోసం నైజాంలో బుకింగ్ ఫైటింగ్

Update: 2022-02-20 06:24 GMT
తెలంగాణ‌లో రాష్ర్టంలో ఆన్ లైన్ సినిమా టిక్కెట్ బుకింగ్ పోర్ట‌ర్ `బుక్ మై షో` బ్యాన్ అయింది. అద‌నంగా బుక్ మైషో  30 రూపాయ‌లు వ‌సూల్ చేయ‌డంతో  ప్రేక్ష‌కుల‌కు భారం  కావ‌డంతో  చిత్ర ప‌రిశ్ర‌మ‌-నైజాం డిస్ర్టిబ్యూట‌ర్స్ అసోసియేష‌న్ బుక్ మై షోని బ్యాన్ చేస్తున్న‌ట్లు నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.

సినిమా చూడాల‌నుకుంటే నేరుగా థియేట‌ర్ కి వెళ్లి కౌంట‌ర్ వ‌ద్ద‌నే టిక్కెట్ విక్ర‌యించి  హాలు లోకి ప్ర‌వేశించాల‌ని కొత్త నియామావ‌ళిని తీసుకొచ్చింది ప‌రిశ్ర‌మ‌. మెట్రో న‌గ‌ర‌మైనా..మున్సీపాలిటీ అయినా ఇప్పుడు సినిమా చూడాలంటే థియేట‌ర్ బుకింగ్ లో నే టిక్కెట్ కొనాలి. ఒక‌ప్ప‌టి  పాత విధానాన్నే మ‌ళ్లీ అమ‌లులోకి తీసుకొచ్చింది.

మ‌రి డిజిట‌ల్ యుగంలో ఇది సాధ్య‌మేనా?  చొక్కాలు చించుకుని టిక్కెట్లు సాధించేంత ఓపిక సాధార‌ణ ప్రేక్ష‌కుడికిగానీ..అభిమానికిగాని ఉందా? అన్న  దానిపై ఓ సారి విశ్లేషిస్తే.. పాత రోజుల్లో అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే?  థియేట‌ర్లు  పూల మాల‌తో  అందంగా ముస్తాబ‌య్యేవి.

అభిమాన సంఘాలు థియేట‌ర్ల‌ని రిలీజ్ కి ముందు రోజు పెద్ద‌ ఎత్తున ముస్తాబు చేసేవారు. బెనిఫిట్ షో చూసి త‌మ అభిమానాన్ని చాటుకునే వారు. హీరో ఒక్కేరే  అయిన ఆభిమాన సంఘాలు మాత్రం మూడు నాలుగు ఉండేవి. నాలుగు  సంఘాల  మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉండేది.

అభిమానుల‌తోనే వారం ప‌ది రోజుల పాటు థియేట‌ర్లు  కిక్కిరిసేవి. బుకింగ్ కౌంట‌ర్ వ‌ద్ద జ‌నాలు బారులు తీరేవారు. చెమ‌ట‌లు కిక్కి టిక్కెట్లు సంపాదించి సినిమా చూసేవారు. న‌చ్చిందంటే నాలుగైదు సార్లు చూసే అడియ‌న్స్ ..ఫ్యామిలీలు సైతం ఉండేవి. కానీ ఇదంతా ఒక‌ప్పుడు.  గ‌తంతో తో పొలిస్తే వ‌ర్త‌మానంలో  చాలా మార్పుల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు.

స్మార్ట్ యుగంలో న‌డుస్తున్నాం. చేతిలో స్మార్ట్ ఫోన్. ఏ సినిమా చూడాల‌న్నా క్ష‌ణం ప‌ని. ర‌క‌ర‌కాల ఓటీటీలు..సినిమాలు అందుబాటులో ఉన్నాయి. న‌చ్చిన సినిమా చూసే వెసులుబాటు ఉంది. అయితే థియేట‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ అనేది  ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి.

ఆ కోణంలో చూస్తే నైజాంలో మ‌ళ్లీ ఓ హీరో సినిమా కోసం బుకింగ్ కౌంట‌ర్ వ‌ద్ద బారులు తీర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ నెల 25న ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న  `భీమ్లా నాయ‌క్` రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ కి నైజాంలో భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

నైజాంలో ఏరియాలో అత‌ని సినిమాలు తొలి రెండు ..మూడు రోజుల వ‌సూళ్లు అసాధార‌ణంగా ఉంటాయి. ప‌వ‌న్ కి ఉన్న ఆ క్రేజ్ కార‌ణంగా నైజాంలో బుకింగ్స్ మ‌ళ్లీ పాత రోజుల్ని త‌ల‌పిస్తాయి? అన్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

గ‌తం కంటే ఇప్పుడు  నైజాం ఏరియాలో కూడా  సినిమా ఫ్యాషినేటెడ్ జ‌నం కూడా బాగా పెరిగారు. ప‌వ‌న్ ఫాలోయింగ్...అభిమానుల ఆరాటం న‌డుమ నైజాంలో బుకింగ్ ఫైటింగ్ గ‌ట్టిగానే ఉండే అవ‌కాశం ఉంది. సినిమా రిలీజ్ కి ఇంకా కొన్ని రోజులే స‌మ‌యం ఉంది. ఈలోపు ప‌రిశ్ర‌మ‌..పంపిణీదారుల‌తో బుక్ మైషో చ‌ర్చ‌లు స‌ఫ‌లం అయితే  బారులు దీరే సీన్ ఉండ‌దు.

ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో అభిమాని టిక్కెట్ కొనుక్కుని సినిమా చూడొచ్చు. లేదంటే బుకింగ్ వార్ త‌ప్ప‌దు. స‌న్నివేశం అంత‌వ‌ర‌కూ వ‌చ్చే అవ‌కాశాలు  చాలా త‌క్కువ‌. రానున్న రోజుల్లో చాలా మంది అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కి   ఉన్నాయి. కాబ‌ట్టి  ప‌రిశ్ర‌మ డిమాండ్ల‌కు బుక్ మై షో  వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News