రోనా మహమ్మారీ క్రైసిస్ రెండేళ్లుగా ప్రజల జీవితాల్ని కల్లోలంలోకి దించేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీఇండస్ట్రీ కార్మికులు దారుణ సన్నివేశంలోకి వెళ్లిపోయారు. సినిమా 24 శాఖలపైనా తీవ్ర ప్రభావం పడింది. అయితే మొదటి వేవ్ వెళ్లాక థియేట్రికల్ రంగం అనూహ్యంగా పుంజుకున్నా.. ఆపై తిరిగి సెకండ్ వేవ్ రంగ ప్రవేశంతో మరోసారి సన్నివేశం మారింది. కొన్ని నెలలుగా థియేట్రికల్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. ఈ రంగంలో కార్మికులు ఉపాధిని కోల్పోయారు.
తాజా సమాచారం ప్రకారం.. ప్రముఖ ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్ బుక్ మై షో 200 మందిని ఉద్యోగాల నుంచి తొలగించిందని కథనాలొస్తున్నాయి. భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా 270 మంది ఉద్యోగులను కంపెనీ తొలగిస్తున్నట్టు ప్రకటించాక ఏడాది నాటికి చర్యలు తీసుకుంది. బుక్ మైషోను నిర్వహిస్తున్న బిగ్ ట్రీ ఎంటర్ టైన్మెంట్ సిఇఒ వివరణ ప్రకారం.. ప్రతిభావంతుల్ని తొలగించాల్సొస్తోంది. కోవిడ్ ఎన్నో పాఠాల్ని నేర్పించింది. తొలగించిన ఉద్యోగులు తమకు సహాయం కోరారు. కొత్త ఉద్యోగాలు పొందడానికి బాధిత సిబ్బందికి సహకరిస్తానని అందుబాటులో ఉన్న ఏవైనా ఉద్యోగ అవకాశాలపై సమాచారం తీసుకుని సాయపడతామని తెలిపారు.
కొత్త ఉద్యోగం కొత్త చోటు ప్రయాణం ప్రారంభించాలనుకునేవారికి ఉద్యోగ సమాచారం తెలియజేయండి అని తెలిపారు. తిరిగి కోవిడ్ క్రైసిస్ నుంచి కోలుకుని అంతా బలంగా తిరిగి వస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అన్ లాక్ ప్రక్రియలో తిరిగి 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను తెరవనున్నారు. ఇప్పటికే పలువురు షూటింగులకు సిద్ధమవుతున్నారు. సంపూర్ణ వ్యాక్సినేషన్ తో కరోనా క్రైసిస్ నుంచి గట్టేక్కితే తిరిగి థియేట్రికల్ రంగం పుంజుకుంటుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.