గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా వున్న మెగాస్టార్ 'ఖైదీ నంబర్ 150' చిత్రంతో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. తమిళ బ్లాక్ బస్టర్ 'కత్తి' ఆధారంగా ఈ చిత్రాన్ని చిరుతో రీమేక్ చేశారు. ఆ తరువాత కొంత వెంటనే 'సైరా నరసింహారెడ్డి' చేసిన మెగాస్టార్ ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో వెంటనే 'ఆచార్య'ని స్టార్ట్ చేశారు. కోవిడ్ కారణంగా దాదాపు రెండేళ్ల విరామం తరువాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఇదే సమయంలో మున్నడూ లేనంతగా యంగ్ హీరోలకు ధీటుగా చిరు బ్యాక్ టు బ్యాక్ నాలుగు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మాంచి జోష్ తో కనిపించారు. చాలా మంది యంగ్ హీరోలతో కలిసి నటించాలని ఆసక్తిని చూపించారు. మొత్తానికి శృతిహాసన్ ని ఓ సినిమాకు హీరోయిన్ గా ఫైనల్ చేసుకున్నారు కూడా. కానీ మెగాస్టార్ జోష్ ని ఒక్కసారిగా 'ఆచార్య' నీరుగార్చింది. రెండేళ్ల విరామం తరువాత థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఊహించని విధంగా చిరుతో పాటు ఆయన అభిమానులకు షాకిచ్చింది. దీంతో భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ గా నిలవడంతో చిరు కూడా ఆసంతృప్తికి లోనయ్యారట.
ఎక్కడ లోపం జరిగిందన్నది పాయింట్ అవుట్ చేస్తూ 'ఆచార్య' తప్పుల్ని తన తదుపరి చిత్రాల్లో పునరావృతం కాకుండా చూసుకోవాలని స్క్రిప్ట్ లలో మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. మోహన్ రాజాతో 'గాడ్ ఫాదర్', మెహర్ రమేష్ తో 'భోళా శంకర్' చిత్రాలు చేస్తున్నారు. ఇవి రెండూ రీమేక్ చిత్రాలే. ఇక బాబి డైరెక్షన్ లో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నారు. దీనికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ని ఫైనల్ చేశారు.
మూడు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న చిరు ఇందులో ఎలాంటి తప్పులు దొర్లకుంగా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన మార్పులు చేర్పులు చేస్తున్నారట. భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఆచార్య' అనూహ్యంగా డిజాస్టర్ గా మారడమే కాకుండా 80 శాతం నష్టాలని మిగల్చడంతో అలాంటి పరిస్థితి మరో సినిమాకు రాకూడదని తగు జాగ్రత్తలు తీసుకోవాలని దర్శక, నిర్మాతలకు సూచిస్తున్నారట. ఇదిలా వుంటే ఈ మూడు క్రేజీ చిత్రాలలో ప్రధానంగా చిరు 'గాడ్ ఫాదర్'పై భారీ నమ్మకంతో వున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్ అయిన కథ కావడంతో తెలుగులోనూ ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చిరు భావిస్తున్నారట.
అందుకే ఈ చిత్రాన్ని ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురవాలని ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇదిలా వుంటే ప్రస్తుతం ఫ్యాన్స్ మాత్రం 'వేదాలం' రీమేక్ ఆధారంగా తెరకెక్కుతున్న 'భోళా శంకర్' విషయంలోనే టెన్షన్ పడుతున్నారట. చాలా కాలంగా డైరెక్షన్ కు దూరంగా వుంటూ వచ్చిన మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు కావడమే మెగా ఫ్యాన్స్ ఆందోళనకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పైగా ఈ మూవీలో మార్పులు చేస్తేనే బాగుంటుందని అభిమానులు, చిరు కూడా కోరుతున్నారట. 'వాల్తేరు వీరయ్య' విషయంలోనూ ఫ్యాన్స్ స్పందన ఇదే తరహా వుండటంతో ప్రస్తుతం మార్పులు చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్.