తెలుగు చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించిన బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక కరోనా లాక్ డౌన్ విపత్కర పరిస్థితుల్లో పేదలకు అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నాడు. దీంతో ఇప్పుడు అందరూ సోనూని నెగెటివ్ రోల్స్ కంటే పాజిటివ్ క్యారెక్టర్స్ లో చూడాలని కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టే దర్శకులు అతని కోసం పాత్రలు రాసుకుంటున్నారు. అయితే ఇప్పుడు సోనూసూద్ ని ప్రతినాయకుడు పాత్రలో నటింపజేయడానికి బోయపాటి శ్రీను ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా సోనూ సూద్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని బోయపాటి భావిస్తున్నాడట. ఇందులో హీరో విలన్ ని చంపకుండా మార్చే ప్రయత్నం చేస్తుంటాడట. అందుకే నెగిటివ్ కమ్ పాజిటివ్ ఫీల్ ఇచ్చే క్రేజీ విలన్ గా సోనూ సూద్ మాత్రమే సూట్ అవుతాడని బోయపాటి అనుకుంటున్నాడట. అయితే సోనూ ఇందులో యాక్ట్ చేయడానికి దాదాపు 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడని.. ప్రస్తుతం సోనూతో బేరసారాలు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది.