ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వినయ విధేయ రామ్ హిట్ అయ్యుంటే ఇప్పుడు బోయపాటి శీను డిమాండ్ ఎక్కడ ఉండేదో ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ దారుణమైన దాని ఫలితం ఒక్కసారిగా ఇతని ప్లాన్స్ అన్ని రివర్స్ చేసింది. బాలయ్య సినిమా పెండింగ్ లో పడిపోయింది. లయన్-లెజెండ్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన తనను హీరో ఇలా హోల్డ్ లో పెట్టడం శీనుకు మింగుడుపడని వ్యవహారమే. అప్పటినుంచి తన భారీ బడ్జెట్ కు సరిపడా నిర్మాత హీరో కోసం వెతుకుతున్న బోయపాటికి ఫైనల్ గా ఓ శాండల్ వుడ్ కథానాయకుడు దొరికాడట.
అతనే నిఖిల్ గౌడ. వెంటనే గుర్తుకురాకపోవచ్చు కానీ మూడేళ్ల క్రితం భారీ బడ్జెట్ తో వచ్చిన జాగ్వార్ హీరో ఇతను. సినిమా ఆడలేదు కానీ దీనికి పెట్టిన ఖర్చు మాజీ సీఎం కుమారస్వామి కొడుకు అన్న విషయం బాగా హై లైట్ అయ్యాయి. ఇప్పుడీ నిఖిల్ గౌడనే బోయపాటితో చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట. బలమైన ఆర్థిక నేపథ్యం కలిగిన నిఖిల్ ఇటీవలే సుమలత మీద ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. అందుకే సినిమాలను కంటిన్యూ చేసే ఆలోచనలో కథలు వింటున్నాడు.
ఒకవేళ ఈ వార్త నిజమైతే బోయపాటి శీను ఎంత బడ్జెట్ అడిగినా నిఖిల్ కాదనే సమస్య రాదు. కాకపోతే తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం లేని మనకు దీని తెలుగు వెర్షన్ తో కనెక్ట్ చేయడం కష్టమే. మల్టీ లాంగ్వేజ్ లో తీస్తారో లేక డబ్బింగ్ కొట్టి వదులుతారో తెలియదు. అసలింతకీ ఈ కాంబినేషన్ నిజంగా రాబోతోందా అనే క్లారిటీ రావాలన్నా ఇంకొద్ది రోజులు వేచి చూడాలి. రామ్ చరణ్ సినిమాతో వచ్చిన బ్యాడ్ రిమార్క్ పోవాలంటే శీను మాములు హిట్ కొడితే సరిపోదు. నిఖిల్ గౌడ లాంటి యావరేజ్ ఇమేజ్ ఉన్న స్టార్ తో అది చేయగలడా. ఏమో చూద్దాం