బోయపాటి ఇరుక్కుపోయాడా?

Update: 2016-02-18 17:30 GMT
ఆరేళ్ల కిందట నందమూరి బాలకృష్ణ పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ గుర్తే. దాదాపు దశాబ్దం పాటు సరైన హిట్టు లేక.. వరుస డిజాస్టర్లతో పాతాళానికి పడిపోయాడు బాలయ్య. ఈ పరిస్థితుల్లో బోయపాటి దర్శకత్వంలో ‘సింహా’ చేశాడు నందమూరి హీరో. ఆ సినిమా మొదలైనపుడు.. విడుదలయ్యేటపుడు.. పెద్దగా అంచనాలేమీ లేవు. కానీ సైలెంటుగా వచ్చిన ఆ సినిమా సెన్సేషనల్ హిట్టయింది. మూడేళ్ల తర్వాత ‘లెజెండ్’ సినిమాతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశాడు బోయపాటి. మొత్తానికి బాలయ్యను నిలబెట్టిన దర్శకుడిగా బోయపాటి అంటే నందమూరి అభిమానులకు చాలా ఇష్టం. ఆ దర్శకుడితోనే బాలయ్య వందో సినిమా చేయాలని వాళ్లందరూ గట్టిగా కోరుకున్నారు. ఈ దిశగా అడుగులు కూడా పడ్డాయి. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘గాడ్ ఫాదర్’ అనే సినిమా రాబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

కానీ సీన్ కట్ చేస్తే బాలయ్య, బోయపాటి ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోతున్నారు. బాలయ్య సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘ఆదిత్య 999’ అంటున్నాడు. బోయపాటి ఏమో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా ఓ సినిమాకు తయారవుతున్నాడు. ఐతే తమ కాంబినేషన్లో ప్రతిష్టాత్మకమైన సినిమా వదిలేసి.. వీళ్లిద్దరూ వేరే సినిమాల వైపు చూస్తుండటమేంటో ఎవ్వరికీ అంతుబంట్టట్లేదు. ఐతే అసలు కారణం ఏంటంటే.. బోయపాటి ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయాలన్నా చేయలేని స్థితిలో ఇరుక్కుపోయి ఉన్నాడట. బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయడానికి ఇంతకుముందే అగ్రిమెంట్ జరిగింది. ఆ సినిమా గత ఏడాదే మొదలవ్వాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది.

కానీ ఇప్పుడు తన కొడుకుతో సినిమా చేయాల్సిందేనంటూ పట్టుబట్టి బోయపాటిని అట్టిపెట్టుకున్నాడట బెల్లంకొండ సురేష్. బాలయ్య కోసం బోయపాటిని ఇవ్వాలని సాయి కొర్రపాటి అడిగినప్పటికీ ఆయన ఒప్పుకోవడం లేదట. ఐతే బెల్లంకొండతో ఇంతకుముందు బాలయ్యకు ఏం జరిగిందో తెలుసు కదా. ఈ నేపథ్యంలోనే బాలయ్య అతణ్ని అడగడమేంటని లైట్ తీసుకోమన్నాడట. ఆ కోపంలోనే సింగీతం శ్రీనివాసరావుతో ‘ఆదిత్య 999’ చేయడానికి రెడీ అయిపోయాడట. ఐతే ఆ ప్రాజెక్టు కూడా ముందుకు కదిలేలా లేదు. బెల్లంకొండ బెట్టు తగ్గిస్తే బోయపాటితోనే బాలయ్య వంద సినిమాలు చేసే అవకాశాలు లేకపోలేదు.
Tags:    

Similar News