‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’: డిఫరెంట్ కాన్సెప్ట్.. యునిక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్..!

Update: 2022-10-11 07:03 GMT
క్రేజీ టైటిల్.. సరికొత్త కంటెంట్.. పోటీ తక్కువగా ఉంది.. ప్రేక్షకుల మూడ్ సరిగ్గా ఉంది.. బిజినెస్ కి సీజన్ అనుకూలంగా ఉంది. ఒక చిన్న సినిమా పెద్దది కావాలంటే ఇంతకంటే ఇంకేం కావాలి? అక్టోబర్ 14న బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 'బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌' సినిమా విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది.

BFH సినిమాలోని 'హైరింగ్ ఎ బాయ్‌ ఫ్రెండ్' అద్దెకు బాయ్ ఫ్రెండ్ అనే పాయింట్ ఇండియన్ సినిమాలో ఇప్పటివరకూ అన్వేషించబడలేదు. ఒక అమ్మాయికి ఏదైనా సమస్య ఉండవచ్చు, ఆమె తన భావాలను తన తల్లిదండ్రులు మరియు స్నేహితులతో పంచుకోగలదు. కానీ కొన్ని విషయాలను వారితో షేర్ చేసుకోలేదు.

అలాంటప్పుడు ఆమెను అర్థం చేసుకోవడానికి.. గందరగోళ పరిస్థితుల నుండి బయటకు తీసుకురాడానికి ఎవరైనా అవసరం ఉంటుంది. ఆ 'ఎవరో' అనేది ఆమె నిజమైన బాయ్ ఫ్రెండ్ కావచ్చు. కానీ మళ్ళీ, ఆ ప్రయోజనం కోసం బాయ్‌ ఫ్రెండ్‌ ని చేసుకోవడంలో అర్థం లేదు.. ఎందుకంటే దానికి ఎంతో నిబద్ధత అవసరం.

అదే ఎవరైనా ఇన్స్టెంట్ బాయ్‌ ఫ్రెండ్‌ గా మారితే? అతనితో కమిట్మెంట్ పూర్తిగా తాత్కాలికమైనది.. అవసరం కోసం చేస్తున్నది ఐతే? సమాజం అంగీకరించకపోయినా అది వర్కౌట్ అవుతుంది. స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో వ్యవహరిస్తే అది పని చేస్తుంది. ఇలాంటి యునిక్ పాయింట్ తో 'బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌' సినిమా తెరకెక్కింది.

యునిక్ కాన్సెప్ట్ మరియు అన్‌ టోల్డ్ స్టోరీ కారణంగా, అదే రోజున విడుదలయ్యే ఇతర సినిమాలతో పోలిస్తే BFH చిత్రానికి అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఓవర్-ది-టాప్ ప్రమోషన్‌లు.. సెలబ్రిటీలు సపోర్ట్ చేయడం మరియు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ఏదైనా విషయాన్ని వైరల్ చేయడం వంటి ఇతర అంశాల కారణంగా కొన్ని సినిమాలకు క్రేజ్ రావడం మనం చూస్తుంటాం. అయితే ఇది జనాలను థియేటర్ల వరకూ తీసుకురావడానికి పనిచేస్తుంది కానీ.. దాని స్థిరత్వం మాత్రం పూర్తిగా సినిమాలోని కంటెంట్‌ పైనే ఆధారపడి ఉంటుంది.

'బాయ్‌ ఫ్రెండ్ ఫర్ హైర్' అనేది ఒక చిన్న సినిమా. పైన పేర్కొన్న జాబితాలోని ఎలాంటి ఫీచర్స్ లేవు కానీ.. సినిమాలోని కంటెంట్‌ తో థియేటర్‌లలో నిలదొక్కుకోవడానికి చాలా మంచి అవకాశం ఉందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. టైటిల్ - కాన్సెప్ట్ మరియు సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే విధానం వంటివి "నిప్పు లేనిదే పొగ రాదు" అని గుర్తు చేస్తుంది. మరి ఈ సినిమా తన లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధిస్తుందో లేదో వేచి చూద్దాం.

"బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్" చిత్రానికి సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించారు. ప్రైమ్ షో ఎంటెర్టైన్మెంట్స్ మరియు స్వస్తిక సినిమా బ్యానర్స్ పై నిరంజన్ రెడ్డి - వేణు మాధవ్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో విశ్వంత్ - మాళవిక సతీషన్ హీరోహీరోయిన్లుగా నటించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News