BFH టీజర్: అద్దె బాయ్ ఫ్రెండ్ గా అమ్మాయిలతో రొమాన్స్ చేసే వర్జిన్ యువకుడి కథ..!
'కేరింత' 'మనమంతా' 'ఓ పిట్టకథ' వంటి సినిమాల్లో నటించిన యువ హీరో విశ్వంత్.. ఇప్పుడు ''BFH'' (బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్) అనే చిత్రంతో అలరించడానికి వస్తున్నాడు. సంతోష్ కుంభంపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవిక సతీషన్ హీరోయిన్ గా నటించింది.
యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'BFH' సినిమా టీజర్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. రోజువారీ రెమ్యునరేషన్ తీసుకొని అద్దె కు బాయ్ ఫ్రెండ్ గా వెళ్లడం అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఈ సినిమాని రూపొందించారని తెలుస్తోంది.
ఒక నైట్ కి కాదు.. ఒక డేకి ఛార్జ్ చేస్తాడు అంటూ హీరో విశ్వంత్ ను అద్దె బాయ్ ఫ్రెండ్ గా పరిచయం చేయడంతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. అతన్ని బుక్ చేసుకున్న వివిధ అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. పూజా రామచంద్రన్ ఆ అమ్మాయిలలో ఒకరిగా కనిపించింది.
అయితే విశ్వంత్ ను హీరోయిన్ మాళవిక సతీశన్ ఒక ఏడాదికి బాయ్ ఫ్రెండ్ గా హైర్ చేసుకుంది. వేరొకరితో పెళ్లిని నివారించడానికి అతన్ని నియమించుకుందనిపిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.
అయితే మాళవికతో రొమాంటిక్ జర్నీ.. విశ్వంత్ లో మార్పు తీసుకువస్తుంది. అతను ఇప్పటికీ వర్జిన్ నే అనే ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. అంతేకాదు బాయ్ ఫ్రెండ్ గా హైర్ చేసుకుందామని వచ్చిన అమ్మాయిపై అతను చిరాకు పడటాన్ని మనం చూడొచ్చు.
మొత్తం మీద సరికొత్త పాయింట్ తో ఆసక్తికరమైన కథా కథనాలతో కూడిన 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్' టీజర్.. రీఫ్రెష్ గా వినోదాత్మకంగా ఉంది. ఇందులో రాజా రవీంద్ర - హర్షవర్ధన్ - సుదర్శన్ - మధునందన్ - శివ నారాయణ - రూపాలక్ష్మి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
ప్రైమ్ షో ఎంటెర్టైన్మెంట్స్ మరియు స్వస్తిక సినిమా బ్యానర్లపై నిరంజన్ రెడ్డి - వేణు మాధవ్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీ సుందర్ దీనికి సంగీతం సమకూర్చారు. బాలా సరస్వతి సినిమాటోగ్రఫీ అందించగా విజయ్ వర్ధన్ ఎడిటింగ్ వర్క్ చేశారు.
'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్' చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. 2022 అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View