యువ హీరో విశ్వంత్ నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ''BFH'' (బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్). సంతోష్ కుంభంపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవిక సతీషన్ హీరోయిన్ గా నటించింది.
ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు యూత్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అద్దెకు బాయ్ ఫ్రెండ్ గా వెళ్లడం అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఈ సినిమాని రూపొందించారని తెలుస్తోంది.
ఇందులో డైలీ బేసిస్ మీద రెమ్యునరేషన్ తీసుకొని బాయ్ ఫ్రెండ్ గా వెళ్లే యువకుడిగా విశ్వంత్ నటించాడు. ఒక నైట్ కి కాదు.. ఒక డేకి ఛార్జ్ చేస్తాడు అంటూ వచ్చిన టీజర్ సోషల్ మీడియాలో బాగా సందడి చేసింది.
రిలీజ్ కు రెడీ అయిన 'BFH' మూవీ నుంచి తాజాగా ప్రమోషనల్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. సినిమాలో హీరో పాత్ర స్వభావాన్ని తెలియజేస్తూ సాగిన ఈ గీతం ఆకట్టుకుంటోంది.
మామా సింగ్ ఈ సాంగ్ కి ట్యూన్ కంపోజ్ చేయడమే కాదు.. తనదైన శైలిలో ఆలపించాడు. 'అందాలు చుట్టు ముట్టే జాబ్ కనిపెట్టాను.. వీడు అద్దెకొచ్చే ప్రేమికుడు అందుకోండి ఆఫర్..' అంటూ క్యాచీ లిరిక్స్ రాసాడు.
ఇందులో విశ్వంత్ తో పాటుగా అషు రెడ్డి - లహరి - అరియనా గ్లోరీ ఆడిపాడారు. 'బిగ్ బాస్' బ్యూటీస్ మన హీరోని హైర్ చేసుకున్నారనే థీమ్ తో ఈ సాంగ్ ని రూపొందించారు. రామ్ ఇసుకపాటి దీనికి కొరియోగ్రఫీ చేసాడు.
"బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్" చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటెర్టైన్మెంట్స్ మరియు స్వస్తిక సినిమా బ్యానర్స్ పై నిరంజన్ రెడ్డి - వేణు మాధవ్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. బాలా సరస్వతి సినిమాటోగ్రఫీ అందించగా.. విజయ్ వర్ధన్ ఎడిటింగ్ వర్క్ చేశారు.
ఇందులో పూజా రామచంద్రన్ - రాజా రవీంద్ర - హర్షవర్ధన్ - సుదర్శన్ - మధునందన్ - శివ నారాయణ - రూపాలక్ష్మి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 'BFH' చిత్రాన్ని 2022 అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View