వాళ్లకి విడాకులు - ఈమెకు పెళ్లి చూపులు

Update: 2016-09-24 05:39 GMT
బాలీవుడ్ స్టార్ కపుల్ బ్రాడ్ పిట్-ఏంజెలీనా జోలీలు విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ బ్రోంజెలీనా జంట విడాకులపై చాలానే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కమెడియన్ ఛెల్సింయా హ్యాండ్లర్ చేస్తున్న కామెంట్స్ సంచలనం అవుతున్నాయి.

'వాళ్లు విడాకులు తీసుకుంటున్నారు కాబట్టి.. నేను పెళ్లి చేసుకునేందుకు రెడీ. ఎవరైనా పెళ్లి ప్రపోజల్ తో నా దగ్గరకు వస్తే అంగీకరించేందుకు రెడీగా ఉన్నా' అంటూ ఛెల్సియా చెప్పింది. ఇంత ఓపెన్ గా ఆ  జంట విడాకులను సమర్ధిస్తోందంటే.. అందుకు తగ్గ కారణం ఉంటుందని అర్ధమవుతుంది. 'ఎన్ని పెళ్లిళ్లు జరిగినా.. బ్రాడ్-జోలీలు పెళ్లి చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. వాళ్లు పెళ్లి చేసుకుంటే.,. విడాకులు తీసుకునేవరకూ నేను పెళ్లి చేసుకోను' అంటూ అప్పట్లోనే స్టేట్మెంట్ ఇచ్చింది.

2014లో వారిద్దరి  పెళ్లి కాగా.. రెండేళ్లుగా ఈ మాట మీద నిలబడింది ఛెల్సియా. అయితే.. చాలామంది ఈ విడాకుల విషయంలో ఏంజెలీనాను సపోర్ట్ చేస్తే.. ఈమె మాత్రం బ్రాడ్ కు మద్దతు పలుకుతోంది. ఏంజెలీనాకు నిలకడ లేదని.. వెర్రి మాలోకం అని పెద్ద పెద్ద కామెంట్స్ నే చేసింది. అసలు బ్రాడ్ పిట్ కు.. ఏంజెలీనా సరైన జోడీ కాదన్నది ఛెల్సియా మాట. ఇప్పుడు వాళ్లిద్దరు విడిపోవడంతో తాను సంతోషంగా ఉన్నానంటూ.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిందీ హాలీవుడ్ కమెడియన్.
Tags:    

Similar News