ఇండియా పాకిస్తాన్ ల మధ్య ఇప్పుడు పరిస్థితులు ఏమీ బాగాలేదు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ.. ఆరోపణలు గుప్పించుకుంటున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో సరిహద్దుల వరకూ వెళ్లి రావడం అంటే రిస్క్ అనే చెప్పాలి. పంజాబ్ లోని వాగా సరిహద్దుకు వెళ్లి మరీ అక్కడి నుంచి ఓ ఫోటో దిగిన బ్రహ్మాజీ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
'వాగా నుంచి ఈ ఫోటో. ఎంతో అద్భుతమైన అనుభవం. థాంక్యూ రకుల్ ప్రీత్.. ఇండికా పాకిస్తాన్ బోర్డర్ ను సందర్శించేందుకు డాడీ వీఐపీ పాస్ ఏర్పాటు చేశారు' అంటూ ట్వీట్ చేశాడు బ్రహ్మాజీ. రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి మాజీ ఆర్మీ ఆఫీసర్. అందుకే ఆయనకు ఇలా పాస్ లకు అనుమతి పొందేందుకు సహహకరించగలిగారన్న మాట. అలా రకుల్ ప్రీత్ సాయంతో.. బ్రహ్మాజీ ఇండియా-పాక్ బోర్డర్ ను చుట్టేశాడు.
ఇండియాలో ఉన్న పంజాబ్ లోని అమృత్ సర్ నుంచి.. పాక్ లో ఉన్న పంజాబ్ లోని లాహోర్ వరకు రోడ్ రూట్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో వాజ్ పేయి హయాంలో బస్ కూడా నడిపారు కూడా.. ఇప్పుడు అనుమతులు లేవు. ఈ రహదారిలో సరిహద్దు ప్రాంతమే వాగా. బ్రహ్మాజీ అక్కడి వరకూ వెళ్లాడు. అదీ సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/