నవంబర్ 14 - చిల్డ్రన్స్ డే. బాలల దినోత్సవం రోజున అందరూ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది తామే చిన్న పిల్లల్లా మారిపోతుంటారు. ఇంకొంతమంది అయితే.. పక్కనోళ్లని ఆటపట్టిస్తుంటారు. ఇదుగో మన భల్లాలదేవుడు కూడా ఇంతే. మహా చిలిపి. సరదాగా ఉండడం - ఏడిపించడం - ప్రాక్టికల్ జోక్స్ వేయడం రాణా మహా దిట్ట. కరెక్ట్ గా చిల్డ్రన్స్ డే నాడు.. బ్రహ్మాజీ ఫోటో ఒకదాన్ని ఇలాగే పోస్ట్ చేశాడు ఇన్ స్టాగ్రామ్ లో.
చిన్న పిల్లలు ఆడుకుంటున్నట్లుగా ఉన్న బ్రహ్మాజీ పోజ్ ని పిక్ తీసి.. పోస్ట్ చేసేశాడు రాణా. ఎర్ర నిక్కరు - రంగురంగుల చొక్కా వేసుకున్న బ్రహ్మాజీని చూడగానే ఎవరికైనా నవ్వొచ్చేస్తుంది. దానికి తోడు పొట్టి నిక్కర్ వేసుకుని ఇచ్చిన పోజ్ ఇంకా సూపర్ గా ఉంది. సాధారణంగానే కామెడీ టైమింగ్ తో అదరగొట్టే ఈ నటుడు.. పోజుని కూడా ఇరగదీసేశాడు.
అయితే బ్రహ్మాజీ పోజ్ ని యాజిటీజ్ గా పోస్ట్ చేయకుండా.. పక్కనో అదే రకమైన పోజ్ ఇచ్చిన ఓ బుడతడితో కలిపి ఇవ్వడంతో.. దీనికి మరింత ఫేమ్ వచ్చింది. నవ్వులాటకే అయినా.. బాలల దినోత్సవం రోజున మరీ ఇంత వెటకారమా అనిపించేలా ఉంది. వెటకారంలో శృతి మించడంతో.. ఒకవైపు నవ్వొస్తున్నా.. మరోవైపు నవ్వడానికి కొంచెం ఆలోచింపచేసేట్టుగా ఉంది. రాణా.. ప్రాక్టికల్ జోక్స్ బాగానే ఉంటాయ్ కానీ.. పోలిక పెట్టేప్పుడు కొంచెం ఆలోచించయ్యా.