తేడా వస్తే పరిస్థితేంటి?

Update: 2020-03-04 17:09 GMT
టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు స్టార్స్ తమ వారసులను బరిలోకి దింపుతూ నెక్స్ట్ జెనరేషన్ అంటూ పరిచయం చేస్తుంటారు. తాజాగా సీనియర్ నటుడు బ్రహ్మాజీ కూడా తన తనయుడిని హీరోగా పరిచయం చేస్తున్నాడు. బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు 'ఓ పిట్ట కథ' అనే సినిమా చేసాడు. సినిమాలో మరో హీరో ఉన్నప్పటికీ ఫైనల్ గా సంజయ్ ని హీరోగా చూపించే ప్రయత్నం చేసారని తెలుస్తుంది. ఓ లవ్ స్టోరీకి ట్విస్ట్ యాడ్ చేసి ఓ క్రైం థ్రిల్లర్ జోనర్ లో సినిమా చేసారు. అది ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.

ఇక తన తనయుడు హీరోగా పరిచయమవుతున్న సినిమా కావడంతో కొన్ని నెలల ముందే తన సర్కిల్స్ ఉన్న దర్శకులను - హీరోలను ప్రమోషన్స్ కోసం వాడేసాడు బ్రహ్మాజీ. మెగా స్టార్ . మహేష్ - ప్రభాస్ ఇలా ఓ డజను పైనే స్టార్స్ ను ప్రమోషన్స్ లో భాగం చేస్తూ సినిమాపై బజ్ తీసుకొచ్చాడు. ఇక్కడ వరకూ అంతా బాగానే ఉంది. కానీ సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా ఓసి ఈ సినిమా కోసమేనా బ్రహ్మాజీ మనల్ని వాడుకున్నది అంటూ స్టార్స్ ఫీలయ్యే అవకాశం ఉంది.

పైగా దర్శకుడు చెందు ముద్దు గతంలో 'ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ' అనే  చిన్న సినిమా తీసి ఫ్లాప్ అందుకున్నాడు. మరి ఈ ఫ్లాప్ డైరెక్టర్ మీద రొటీన్ స్టోరీ మీద బ్రహ్మాజీ అండ్ సన్ కాన్ఫిడెన్స్ ఏమిటో చూడాలి.
Tags:    

Similar News