సైరా కోసం గుండు

Update: 2017-12-31 11:46 GMT
మెగాస్టార్ చిరంజీవి 151 మూవీ సైరా నరసింహారెడ్డి సెకండ్ షెడ్యూల్ కోసం రంగం సిద్దం అవుతోంది. కొన్ని విషయాల్లో సందిగ్దత ఇంకా కంటిన్యూ అవుతున్నప్పటికీ షూటింగ్ మాత్రం ఆపకూడదు అని నిర్మాత రామ్ చరణ్ గట్టిగా డిసైడ్ అవ్వడంతో జనవరి నుంచి అంతా ప్లానింగ్ ప్రకారమే జరగబోతోంది. ఇందులో ఒక కీలక పాత్ర కోసం బ్రహ్మాజీని తీసుకున్నారు. నరసింహారెడ్డి పక్కన నమ్మిన బంటులా ఉండే ఈ పాత్ర ఒరిజినల్ గా నున్నని గుండుతో బాగా గుబురుగా పెరిగిన మీసంతో చాలా టెర్రిఫిక్ గా ఉంటుందట. న్యాచురాలిటి కోసం ఏ విషయంలోనూ కాంప్రోమైజ్ అవడం ఇష్టం లేని దర్శకుడు సురేందర్ రెడ్డి అదే గెటప్ లో నటిస్తాను అంటేనే వేషం ఇస్తాను అని చెప్పడంతో మరో ఆలోచన చేయకుండా వెంటనే గుండు కొట్టించుకోవడం బ్రహ్మాజీ కమిట్మెంట్ ని చూపుతోంది.

నరసింహ రెడ్డి అనుచరులుగా ఇప్పటికి ముగ్గురు డిసైడ్ అయ్యారు. ఓబయ్యగా విజయ్ సేతుపతి కీలక పాత్ర చేస్తుండగా, పక్కనే ఉంటూ ద్రోహం చేసే రోల్ లో జగపతి బాబు - ఇప్పుడు వీరితో పాటు డేగ కళ్ళతో నరసింహ రెడ్డికి కాపలా ఉండే పాత్రలో బ్రహ్మాజీ కన్ఫర్మ్ అయ్యాడు. పాత్ర పేరు ఏమిటి అనేది మాత్రం బయటికి రాలేదు. గత కొద్ది రోజులుగా బ్రహ్మాజీ బయట ఎక్కడ కనిపించినా తలపాగాతో కనిపిస్తున్నాడు. ఏంటని అడిగితే సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ గుండు రహస్యం కాస్తా బయటికి వచ్చేసింది. నయనతార హీరొయిన్ గా నటిస్తున్న సైరా లో అమితాబ్ బచ్చన్ చిరంజీవికి గురువుగా నటించబోతున్నట్టు తెలిసింది. రెహమాన్ తప్పుకున్నాక మ్యూజిక్ డైరెక్టర్ సంగతి మాత్రం తేల్చలేదు. రెగ్యులర్ అప్ డేట్స్ తో సైరా లైం లైట్ లో ఉండటం మెగా ఫాన్స్ కి బాగా కిక్ ఇస్తోంది.
Tags:    

Similar News