వెయ్యి సినిమాలకు పైగా చేసి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న బ్రహ్మానందం త్వరలో బాలీవుడ్ ఎంట్రీ చేయబోతున్నారు. ఒక్కరే కాదు సునీల్ తో కలిసి. ఇదే పెద్ద విశేషం అనుకుంటే ఈ ఇద్దరు కలిసి చేస్తున్న మూవీలో కీలక పాత్ర సన్నీ లియోన్ కావడం. తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహించబోయే హింది మూవీ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో మందన కరిమి మరో ముఖ్యమైన రోల్ లో కనిపించనుంది.
హారర్ కామెడీ జానర్ లో రూపొందబోయే ఈ ప్రాజెక్ట్ కు ఇంకా టైటిల్ డిసైడ్ కాలేదు. దర్శకుడు తెలుగు వాడే కావడం వల్ల సునీల్ బ్రమ్మీలకు ఈ ఛాన్స్ వచ్చింది కాని మొత్తానికి నార్త్ ప్రేక్షకులకు తమ కామెడీ టేస్ట్ ని స్ట్రెయిట్ గానే చూపించబోతున్నారు ఇద్దరు. ఇదే సినిమాలో సునీల్ మీద ఓ పాట కూడా ఉంటుందని తెలిసింది. ఎలాగూ సన్నీ సునీల్ బ్రమ్మీ మనకు పరిచయమున్న వాళ్ళే కాబట్టి తెలుగులోనూ డబ్బింగ్ చేస్తారు. మహేందర్ ధరివాల్-పరందీప్ సందు నిర్మాతలుగా వ్యవహరిస్తారు .
ఒకవేళ ఇది కనక క్లిక్ అయితే ఈ ఇద్దరు హాస్య నటులకు అక్కడో కెరీర్ దొరికినట్టే. చేయలేదనే మాటే కాని మన డబ్బింగ్ సినిమాల రూపంలో నార్త్ ప్రేక్షకులు సునీల్ సినిమాలు చాలానే ఎంజాయ్ చేశారు. ప్రతి సినిమాలో కనిపించే బ్రమ్మీ వాళ్ళకు అలవాటే. కాకపోతే హింది నటీనటులతో నటించడం మాత్రమే కొత్త. ఆ మధ్య కొంత గ్యాప్ ఇచ్చినా బ్రహ్మానందం మళ్ళి స్పీడ్ అందుకుంటున్నారు