పాన్ ఇండియా చిత్రం `పుష్ప`లో సమంత ఐటమ్ సాంగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా లిరికల్ సాంగ్ ని కూడా రిలీజ్ చేసారు. దాంతో పాటు సమంత లుక్ ఎలా ఉండబోతోందో రివీలైంది. మాస్ ఆడియన్స్ కి ఆ పాట కిక్కు పుట్టించనుంది. సుకుమార్ స్టైల్లో ఐటం పాటలో సమంత అదరగొట్టిందనేది టాక్. సామ్ తన ఫ్యాన్స్ ని..ఐకాన్ స్టార్ బన్నీ ఫ్యాన్స్ ని కూడా మెప్పించడం ఖాయం. సమంత అందాలు పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ పాటని ఇప్పుడు ఓ నెటిజన్ పీక్ స్టేజ్ కి తీసుకెళ్లాడు.
బ్రహ్మనందం చిత్రాల్లోని కొన్ని వీడియోల్ని అన్నింటిని కలిపి లింకప్ చేసి ఈ మాస్ సాంగ్ తో రీమిక్స్ చేసాడు. `ఊ అంటావా..ఊఊ అంటావా` అంటూ పాట బ్యాక్ డ్రాప్ లో సాగుతుంటే తెర ముందు బ్రహ్మానందం కామిక్ వీడియోలు.. ఎక్స్ ప్రెషన్స్ చక్కగా క్యారీ అయ్యాయి. ఇప్పుడా టీజింగ్ వీడియో నెట్టింట నెటి జనుల్లో నవ్వులు పూయిస్తోంది. బ్రహ్మీ వెర్షన్ ని అద్భుతంగా ఎటిడ్ చేసారంటూ అప్లాజ్ దక్కింది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కూడా ఈ టీజింగ్ వీడియో చూసి తెగ నవ్వుకున్నాడు. ఇది చాలా ఉల్లాసంగా ఉంది. సూపర్ ..ఖచ్చితంగా అంటూ ఓ పోస్ట్ పెట్టాడు.
అయితే కొంత మంది నెటిజనులు ఇలా చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సాహిత్యం విలువలు దిగజారిపోతున్నాయని మండిపడుతున్నారు. మహిళలకు..వాళ్లు ధరించే చీరలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వాటి ప్రాధాన్యత ఇలాంటి సాహిత్యాన్ని సమకూర్చడం దిగజారుడు తనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్ర్తీ ఎలా ఉన్నా....ఏం ధరించినా? ఎక్కడ నుంచి వచ్చినా పురుషలందరికీ స్త్రీ అవసరం ఉంటుందనే సాధారణీకరణతో వారు ఏకీభవించడం లేదు. సినిమా సందర్భం..ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో పాటని సెటప్ చేయడం వల్ల సాహిత్యం బాగా అనిపించొచ్చు. కానీ ఇలా చేయడం మాత్రం ఆమోదయోగ్యం కాదని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ టీజింగ్ వీడియో `పుష్ప` సినిమాకి కోట్ల రూపాయల పబ్లిసిటీని తెచ్చిపెడుతోంది.