తెలుగు చిత్ర పరిశ్రమలో అలాగే కన్నడలో తమిళంలో కూడా పాన్ ఇండియా సినిమాలు భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో ఇక బాలీవుడ్ నుంచి కూడా అలాంటి ప్రయోగాలు బాక్సాఫీస్ వద్ద వాటి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అయితే ఈ ఏడాది బ్రహ్మాస్త్ర సినిమా తప్పకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో అసలైన పాన్, ఇండియా మూవీగా నిలుస్తుంది అని అందరు అనుకున్నారు.
అయితే ఈ సినిమా పూర్తిస్థాయిలో మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అందుకోలేకపోయింది. ఒక విధంగా సౌత్ ఇండస్ట్రీ ఫ్యాన్ ఇండియా రికార్డులను కూడా ఆ సినిమా అంతగా బ్రేక్ చేయలేకపోయింది. కేవలం హిందీ భాషలోనే కొంత మంచి కలెక్షన్స్ అయితే అందుకుంది. ఇక మొత్తానికి బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సినిమా థియేట్రికల్ గా హడావుడి అయితే ముగిసింది. ఓటీటీ లో ఇటీవల విడుదలైనప్పటికీ కూడా కొన్ని థియేటర్లలో కొనసాగించారు.
బ్రహ్మాస్త్ర మొదటి భాగం శివ సెప్టెంబర్ 9న థియేటర్స్ లో విడుదలైన విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమాని కరణ్ జోహార్ నిర్మించారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించగా ఇక ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అదే స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాస్త్ర సినిమా 428 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఒక విధంగా పెట్టిన పెట్టుబడికి నిర్మాతలు చాలా వరకు సేఫ్ జోన్ లోకి వచ్చినప్పటికీ ఈ సినిమాను పంపిణీ చేసిన కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం నష్టాలు చూడక తప్పలేదు. ఇక తెలుగులో మాత్రం బిజినెస్ కు తగ్గట్టుగా బాగానే ఈ సినిమా కలెక్షన్స్ అందుకుంది. ఈ సినిమా తెలుగులో 4.55 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసింది.
ఇక షేర్ కలెక్షన్స్ దాదాపు 12.62 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బయ్యర్లకు ఈ సినిమా దాదాపు తెలుగులో అయితే 7.82 కోట్ల వరకు లాభాలను అందించింది. అయితే పూర్తిస్థాయిలో మాత్రం అన్ని భాషల్లో బ్రహ్మాస్త్ర సినిమా ప్లాన్ వర్కౌట్ కాలేదు. మొత్తంగా ఈ సినిమాను మూడు భాగాలుగా విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు. మరి సెకండ్ పార్ట్ ని ఏ విధంగా విడుదల చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.