స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా ఆర్య సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభం నుంచి కరోనా మహమ్మారీ వెంటాడుతూనే ఉంది. నిజానికి ఇది ఊహించని పరిణామం కావడంతో సుకుమార్ చాలానే డిస్ట్రబ్డ్ అయ్యారు. అనుకున్న షెడ్యూల్స్ ఏవీ అనుకున్నట్టు జరగలేదు. దానివల్ల చాలా విలువైన సమయం వృధా అయ్యింది.
పుష్ప చిత్రాన్ని కథాంశం ప్రకారం.. శేషాచలం అడవులలో చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. కానీ తితిదే అనుమతులు లభించలేదు. ఆ తర్వాత బ్యాంకాక్ థాయ్ లాండ్ లోని దట్టమైన అడవులకు వెళ్లాలని అనుకున్నారు. ఈలోగానే కరోనా మహమ్మారీ ఊహించని పిడుగులా రంగ ప్రవేశం చేసింది. అప్పటి నుంచి పుష్ప షెడ్యూళ్లు ఏవీ అనుకున్నట్టు జరగలేదు. దీంతో టైమంతా చాలా వృధా అయ్యింది. అయినా మారేడుమిల్లి- తూ.గో జిల్లా అడవులు చింతపల్లి అడవుల్లో సుకుమార్ ఈ సినిమా కీలక షెడ్యూళ్లను తెలివిగా ప్లాన్ చేశారు.
పుష్ప డ్యూయాలజీలో మొదటి భాగం (పుష్ప-1) చిత్రీకరణ మెజారటీ భాగం పూర్తయింది. కొద్దిపాటి చిత్రీకరణను పూర్తి చేయాల్సి ఉండగా సెకండ్ వేవ్ వల్ల ఆలస్యమైంది. ఇటీవల చిత్రీకరణ తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా సుకుమార్ కి ఫీవర్ వచ్చిందని సమాచారం. అతడికి వచ్చినది వైరల్ ఫీవర్. అందువల్ల రిలాక్స్ అయ్యేందుకు కావాల్సినంత సమయాన్ని ఇచ్చారట. దీనివల్ల కొద్దిరోజుల పాటు పుష్ప చిత్రీకరణకు బ్రేక్ తప్పదని తెలిసింది. ఇక సుకుమార్ కి ఆరోగ్యం పరంగా భయపడాల్సినదేమీ లేదని కూడా చిత్రబృందం వెల్లడించింది. మొదటి భాగానికి సంబంధించిన కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఎలాగైనా రెండు నెలల్లో ఆ పనులన్నీ పూర్తి చేయాలన్నది ప్లాన్.
తదుపరి ప్రచారానికి సిద్ధం:
ఓవైపు షూటింగ్ ఆలస్యమవుతున్నా ఇక ప్రచారం పరంగా డిలే చేయరని తెలిసింది. ప్రచారబరిలో భాగంగా దేవీశ్రీ హంగామా షురూ కానుందని సమాచారం. తొలిగా మేకింగ్ వీడియోని కానీ ఏదైనా లిరికల్ సింగిల్ ని కానీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రాక్ స్టార్ బరిలో దిగితే ప్రచారం ఓ రేంజులోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ మూవీకి కూడా ఆర్య - ఆర్య 2 రేంజులో అదిరిపోయే పెప్పీ సాంగ్స్ ని దేవీశ్రీ అందిస్తున్నారు. ఇందులో రింగ రింగ తరహా మాస్ ని ఊపేసే ప్రత్యేక గీతం కోసం అతడు స్పెషల్ గా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. పుష్ప లాంటి పాన్ ఇండియా చిత్రానికి అవసరమయ్యే రీరికార్డింగ్ ని అతడు పక్కాగా ప్రిపేర్ చేస్తున్నారు.
రిలీజ్ ఎలా ఎప్పుడు?
ఇంతకీ పుష్ప రిలీజ్ మ్యాటర్ ఏమిటి? అంటే.. నిజానికి అంతా సవ్యంగా సాగితే ఈపాటికే చిత్రీకరణ పూర్తయి రిలీజ్ కావాల్సి ఉంది. థర్డ్ వేవ్ రాకముందే రిలీజ్ చేయాలని ఆత్రపడుతున్నా చిత్రీకరణ పూర్తవ్వడం లేదు. ఏదో ఒక అడ్డంకితో షూట్ ఆగిపోతూనే ఉంది. పుష్ప మొదలైనప్పటి నుంచి ఇవే సమస్యలు.. కానీ ఎట్టకేలకు ఇన్ని కష్టాలు పడి చిత్రీకరించినందుకు ఔట్ పుట్ విషయంలో ఎక్కడా తగ్గలేదని అద్భుతంగా వచ్చిందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎర్రచందనం దుంగల స్మగ్లర్ గా బన్ని మాస్ ఆహార్యం యాక్షన్ మరో లెవల్లో ఉంటాయని చెబుతున్నారు. ఈ సమ్మర్ లో రాలేదు. దసరాకి రాదు. క్రిస్మస్ నాటికి రెడీ అయ్యే వీలుంటుంది. లేదా 2022 సంక్రాంతికే అంటూ పుష్ప టీమ్ లో రిలీజ్ మ్యాటర్ డిస్కషన్ కి వచ్చింది. అంతా నువ్వే చేశావ్..! అంటూ కరోనాని తిట్టుకోవాల్సిన పరిస్థితి బన్ని అభిమానులకు ఎదురైంది.