దశాబ్దాల పాటు కలిసి పనిచేసిన తర్వాత ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) తో పూర్తిగా సంబంధాలు తెంచుకున్నట్లు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రకటించింది. లైట్ మెన్- మేకప్ మెన్- క్రేన్ ఆపరేటర్లు- కెమెరా ఆపరేటర్లు .. ఫెడరేషన్ ఏర్పాటు చేసే 24 క్రాఫ్ట్ లకు సంబంధించి కార్మికులు ఎవరినైనా నియమించుకునే హక్కు మీకుందని చిత్ర నిర్మాతలకు సూచించారు.
FEFSI అధిపతి R.K. సెల్వమణి తన వ్యక్తిగత సామర్థ్యంలో లేదా ఫెడరేషన్ కౌన్సిల్ తో ఒప్పందం విషయంలో ఏ నిబంధనను ఉల్లంఘించలేదని పేర్కొంటూ ఒక ప్రకటనను విడుదల చేసారు. AAA ఫేమ్ మైఖేల్ రాయప్పన్ సహా నలుగురు నిర్మాతలతో పెండింగ్ వివాదాలు ఉన్నందున శింబు నటించే కొత్త సినిమాలకు సహకారం ఇవ్వరాదని కౌన్సిల్ సర్క్యులర్ పంపిందని ఆయన వివరించారు.
గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన శింబు కొత్త సినిమా `వెండు తనింధాడు కాదు` షూటింగ్ ప్రారంభమైంది. ఈ వివాదం రెండు సంస్థల మధ్య చీలికకు కారణమైందని చెబుతున్నారు. చెన్నై వెలుపల కేవలం నాలుగు రోజుల చిత్రీకరణకు నిర్మాత ఇషారి వేలన్ నిర్మాత మండలికి అనుమతి కోరినట్లు సెల్వమణి స్పష్టం చేశారు. అయితే శింబు వివాదాలు పరిష్కరించబడతాయి. ఆ తర్వాతే చెన్నైలో తదుపరి షెడ్యూల్ ప్రారంభమవుతుందని నిర్మాత ఇషారి వేలన్ హామీ ఇచ్చారు.
సెల్వమణి ప్రకారం.. నిర్మాతల కౌన్సిల్ ఇచ్చిన అనుమతితో మాత్రమే ఫెప్సీ శింబు చిత్రానికి సహకరించింది. ఈ తీవ్రమైన సమస్యను కలిగించడానికి కొన్ని కనిపించని శక్తులు పని చేస్తున్నాయని ప్రతిష్టంభనను అంతం చేయడానికి మాట్లాడేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.