బ్రిట్నీ స్పియర్స్ (40) సీక్రెట్ పెళ్లి సంచలనంగా మారింది. తన ప్రియుడు సామ్ అస్గారి(28)ని బ్రిట్నీ అధికారికంగా వివాహం చేసుకుంది. ఈ జంట లాస్ ఏంజిల్స్ లో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో సింపుల్ గా పెళ్లాడేసారు. దాదాపు 60 మంది అతిథులు ఈ పెళ్లికి హాజరయ్యారు. పారిస్ హిల్టన్- మడోన్నా సహా పలు పరిశ్రమలకు చెందిన వారి సన్నిహితులు ఈ వేడుకలో ఉన్నారు. ఈ జంట జూన్ 9న తమ పెళ్లి గురించిన హింట్ ఇచ్చారు. వెర్సాస్ డిజైన్ చేసిన వెడ్డింగ్ గౌను ధరించనున్నట్లు బ్రిట్నీ స్పియర్స్ తొలుత ధృవీకరించారు.
ప్రఖ్యాత పీపుల్ మ్యాగజైన్ కథనం ప్రకారం.. ఇది బ్రిట్నీకి మూడో పెళ్లి. ఎల్విస్ ప్రెస్లీ కాంట్ హెల్ప్ ఫాలింగ్ ఇన్ లవ్ థీమ్ ప్లే అవుతుండగా.. బ్రిట్నీ అద్భుతమైన గౌనులో వివాహ వేదికపై కనిపించింది. వివాహ అతిథులలో బ్రిట్నీ కుమారులు సీన్ ప్రెస్టన్ - జేడెన్ జేమ్స్.. తన మాజీ భర్త కెవిన్ ఫెడెర్ లైన్ ఉన్నారు. గత సంవత్సరం నిశ్చితార్థం చేసుకున్న బ్రిట్నీ స్పియర్స్ - అస్గారి ఇప్పుడు మరీ అంత హడావుడి లేకుండా ఆకస్మికంగా పెళ్లాడేయడం హాట్ టాపిక్ గా మారింది. 2016 మ్యూజిక్ వీడియో సెట్ లో కలుసుకున్న తర్వాత అస్గారీ- బ్రిట్నీ జంట రొమాంటిక డేట పుకార్లకు దారితీసింది. అస్గర్ తో తన వీడియో షూట్ తర్వాత మళ్లీ కనెక్ట్ కావడానికి దాదాపు ఐదు నెలలు పట్టిందని స్పియర్స్ 2017లో వెల్లడించింది. 13 సంవత్సరాల పాటు కొనసాగిన ఆమె కన్జర్వేటర్ షిప్ (పాత పెళ్లి వివాదం) గత సంవత్సరం రద్దయింది. దాంతో సామ్ - బ్రిట్నీ బాండింగ్ కి ఇది సహకరించింది. లైఫ్ కీలక సమయంలో కష్టకాలంలో తన పక్కన ఉన్నందుకు ఆమె అతన్ని తన రాక్ అని కూడా పేర్కొంది.
ఇన్ స్టాగ్రామ్ లో బ్రిట్నీ ఇంతకుముందు తన పెళ్లి గురించి క్లూ ఇచ్చి అభిమానులను ఆటపట్టించింది. ఇంతలోనే ఇప్పుడు పెళ్లికూతురైంది. ప్రియుడిని మనువాడి తదుపరి లైఫ్ గురించి కలలు కంటోంది. బ్రిట్నీ స్పియర్స్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఈ పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 40 ఏళ్ల బ్రిట్నీ 28 ఏళ్ల యంగ్ బోయ్ ని పెళ్లాడేయడం సంథింగ్ స్పెషల్ అంటూ ముచ్చటించుకోవడం కనిపిస్తోంది.
కొన్నేళ్లుగా ప్రేమలోనే ఉన్నారు!
2004లో బ్రిట్నీస్పియర్స్ తన చిన్ననాటి స్నేహితుడు అలెగ్జాండర్ ను వివాహం చేసుకోగా.. ఈ పెళ్లి 55 గంటలకే వీగిపోవడం అప్పట్లో సంచలనమైంది. ఆ తర్వాత కెవిన్ ఫెడర్ లైన్ ను బ్రిట్నీ పెళ్లాడి ఇద్దరు బిడ్డలకు తల్లి అయ్యింది. ఈ జంటకు సీన్- జైడెన్ అని ఇద్దరు కుమారులున్నారు. 2007లో కెవిన్ కు విడాకులిచ్చేసిన బ్రిట్నీ ఆ తర్వాత 2016లో స్లంబర్ పార్టీ అనే వీడియో సాంగ్ లో కోస్టార్ సామ్ అస్ఘరితో ప్రేమలో పడింది. వీరిద్దరూ గతేడాది నిశ్చితార్థం చేసుకున్నారు. తన తాజా ప్రియుడితో కలిసి ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నానని ప్రకటించిన బ్రిట్నీ అంతలోనే గర్భస్రావం అయ్యిందని తెలిపింది.