మెగా సందడికి ముహూర్తం కుదిరింది

Update: 2015-09-20 11:30 GMT
ఓవైపు చిరంజీవికి సంబంధించిన సన్నివేశాలు ఇంకా పూర్తి కాలేదంటున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ లోనూ హడావుడి నెలకొందంటున్నారు. తమన్ ఆడియో, బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలోనూ కొంచెం లేటు చేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ‘బ్రూస్ లీ’ అనుకున్నట్లే అక్టోబరు 16న వస్తుందా లేదా అన్న సందిగ్ధంలో ఉన్నారు అభిమానులు.

ఇంతలో మెగా ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తే ప్రకటన వచ్చింది. అక్టోబరు 2న బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్ జరుగుతుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్విట్టర్ లో ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. రాకింగ్ మ్యూజిక్ కి రెడీ గా ఉండటంటూ ట్వీట్ చేశాడు తమన్. మ్యూజిక్ డైరెక్టరే ఈ స్టేట్ మెంట్ ఇచ్చాడంటే ఇక ఆడియో ఫంక్షన్ విషయంలో సందేహాలేమీ పెట్టుకోవాల్సిన పని లేదన్నమాటే. ఇప్పటికైతే ‘బ్రూస్ లీ’ని వాయిదా వేసే ఆలోచనేమీ లేదనే అనుకోవాలి.

అప్పుడెప్పుడో ‘మగధీర’లో మెరిశాక.. మెగాస్టార్ మళ్లీ తెరమీద కనిపించబోతున్న సినిమా ‘బ్రూస్ లీ’. పైగా ఇందులో చిరు పావుగంటపైనే దర్శనమిస్తాడంటున్నారు. కాబట్టి మెగా అభిమానులకు పండగేనన్నమాటే. చిరు రీఎంట్రీ మూవీ కావడంతో ఆడియో ఫంక్షన్ లో హంగామా ఓ రేంజిలో ఉంటుందనడంలో సందేహం లేదు. మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఫంక్షన్ లో సందడి చేస్తారు. ఏర్పాట్లు భారీగానే ఉంటాయి. స్పీచ్ లు చాలా స్పెషల్ గా ఉంటాయి. పైగా అదే రోజు వరుణ్ సినిమా ‘కంచె’ విడుదల. కాబట్టి అక్టోబరు 2 మెగా డే కాబోతుందన్నమాటే.
Tags:    

Similar News