బ్రూస్ లీ ది ఫైటర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఆడియో సంచలనాలకు వేదికగా మారుతోంది. బ్రూస్ లీలో మొత్తం 5 పాటలుండగా.. అన్నిటికీ రిలీజ్ రోజునే సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మెలోడీలు - మాస్ బీట్లు కూడా జనాల నోళ్లలో - ఐపాడ్స్ లో, మ్యూజిక్ సిస్టమ్స్ లో - ఎఫ్ ఎం రేడియోల్లో వినిపిస్తున్నాయి. ఎక్కడ విన్నా బ్రూస్ లీ సాంగ్స్ రచ్చ చేసేస్తున్నాయి.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మొత్తం కెరీర్ లో ఓ ఆల్బంకి ఇంతగా రెస్పాన్స్ రావడం ఇదే ఫస్ట్ టైం. లే చలో - రన్ లైఫ్ అంటే రేసురా రన్ - బ్రూస్ లీ టైటిట్ సాంగ్ - మెగా మీటర్ సాంగ్స్ కు రెస్పాన్స్ విపరీతంగా ఉంది. ఈ పాటలనే ఎక్కువగా వినిపిస్తున్నాయి ఎఫ్ ఎం రేడియో స్టేషన్స్. ఈ వారం టాప్ ఫైవ్ ఆడియోలో ఎన్ని పాటలు చోటు దక్కించుకుంటాయో అనే ప్రశ్న తలెత్తుతోంది. సాధారణంగా ఒక ఆల్బం నుంచి టాప్ ఫైవ్ లో ఒకటో - రెండో పాటలు స్థానం దక్కించుకుంటాయి. కానీ బ్రూస్ లీ విషయంలో 4 సాంగ్స్ ఎంట్రీ ఖాయం అంటున్నాయి రేడియో స్టేషన్స్.
కొంచెం కాలం కలిసొస్తే.. ఐదో సాంగ్ కూడా ఎంటర్ అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏళ్ల తరబడి విమర్శలు ఎదుర్కున్న తమన్.. తానెందుకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకడిగా ఎదిగాడో ఒక్క ఆల్బంతో నిరూపించేసుకున్నాడు. ఆడియో టాప్ ఫైవ్ లిస్ట్ ఏంటో తెలియాలంటే మరో 24 గంటలు ఆగాలి.