ఓ సినిమా కాన్సెప్ట్ ఏంటో బయటపడకుండా దాచి పెట్టడమంటే ఈ రోజుల్లో చాలా చాలా కష్టం. ఎంత పెద్ద సినిమాలకు సంబంధించిన విశేషాలైనా ఏదో ఒక మార్గంలో బయటికి వచ్చేస్తూనే ఉంటాయి. ఈ మధ్య వచ్చిన పెద్ద సినిమాల కథలన్నీ దాదాపుగా ముందే బయటపడిపోయాయి. ఐతే ఈ రోజుల్లో కథ కంటే కూడా కథనానికి ప్రాధాన్యం కాబట్టి.. చాలా మంది స్టార్ డైరెక్టర్ లు రొటీన్ కథలతోనే ప్రయాణం సాగిస్తున్నారు కాబట్టి.. కాన్సెప్ట్ బయటపడిపోతుందేమో అనే భయం ఎవరికీ లేదు. అందుకే స్టోరీ లీకైనా పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా రామ్ చరణ్ సినిమా ‘బ్రూస్ లీ’ కాన్సెప్ట్ బయటకు వచ్చింది. ఈ సినిమా కథ ఇదంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఆ విశేషాలేంటో చూద్దాం పదండి.
బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్ స్టంట్ మాస్టర్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే వాస్తవానికి అతనో సీక్రెట్ పోలీస్ అట. తన అక్క (కృతి ఖర్బంద) అనుకోని విధంగా కొందరి గూండాల చేతిలో మరణిస్తుంది. ఆ గూండాలు ఎవరు.. ఏంటి అని ఎంక్వైరీ చేస్తే వారి వెనక ఓ పెద్ద డాన్ ఉన్నాడనే విషయం బయిట పడుతుంది. దాంతో ఆ డాన్ సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ సామ్రాజ్యాన్ని అంచెలెంచులుగా పడగొట్టడానికి ప్రణాళికలు వేస్తాడు. ఆ డాన్ పని పట్టడానికి ఫైట్ మాస్టర్ అవతారమెత్తి అతడికి చేరువవుతాడు. తన అక్కన చంపడానికి కారణం తెలుసుకుని.. ఆ డాన్ మీద హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది మిగతా కథ. ఇదీ ప్రచారంలో ఉన్న బ్రూస్ లీ స్టోరీ. ఇందులో వాస్తవమెంతో తెలియాలంటే అక్టోబరు 16 వరకు ఆగాలి.