ఓవర్సీస్ మార్కెట్ ఓ బంగారు బాతు అన్న సంగతి మన టాలీవుడ్ నిర్మాతలు కొంచెం లేటుగా గ్రహించారు. బాహుబలి సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు ఎక్కించింది. ఆ దెబ్బతో నాని లాంటి చిన్న హీరో సైతం ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో పది కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టాడు. ఓవర్సీస్ కింగ్ మహేష్ సైతం ‘శ్రీమంతుడు’ సినిమాతో తన కెరీర్ లో కొత్త రికార్డులు నెలకొల్పాడు. ఈ ఊపులో ఓవర్సీస్ అడ్వాంటేజ్ ను ఫుల్లుగా వాడేసుకోవాలని చూస్తున్నాడు రామ్ చరణ్.
చిరు తనయుడికి ఇప్పటిదాకా యుఎస్ లో మిలియన్ క్లబ్ మూవీనే లేదు. ‘బ్రూస్ లీ’తో ఆ లోటు తీర్చేసుకోవడానికి పక్కా ప్లాన్ తో రెడీ అయ్యాడు చరణ్. ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమా లేని స్థాయిలో ‘బ్రూస్’లీని అమెరికాలో రిలీజ్ చేస్తున్నారు. ఏకంగా ఉత్తర అమెరికాలో 220 స్క్రీన్స్ లో ‘బ్రూస్ లీ’ విడుదల కాబోతోంది. బాహుబలి సినిమా కూడా ఈ స్థాయిలో రిలీజ్ కాలేదు. ఆ సినిమాకు 200 లోపు స్క్రీన్సే ఇచ్చారు. మొత్తంగా ఓవర్సీస్ రికార్డుల్ని కూడా ‘బ్రూస్ లీ’ చెరిపేస్తోంది. ఓవర్సీస్ లో మొత్తం దాదాపు 350 స్క్రీన్ లలో ‘బ్రూస్ లీ’ విడుదల కాబోతోంది. దాదాపుగా అన్ని చోట్లా ముందు రోజు ప్రిమియర్ షోలు ప్లాన్ చస్తున్నారు. మామూలుగానే ‘బ్రూస్ లీ’పై అంచనాలు భారీగా ఉండగా.. చిరంజీవి అతిథి పాత్ర పోషించడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నెల 16న చాలా భారీగానే ‘బ్రూస్ లీ’ విడుదల కాబోతోంది.