చిత్రం : బ్రూస్ లీ
నటీనటులు - రామ్ చరణ్ తేజ్ - చిరంజీవి - రకుల్ ప్రీత్ సింగ్ - కృతి కర్బందా - అరుణ్ విజయ్- సంపత్ రాజ్ - టిస్కా చోప్రా - బ్రహ్మానందం- రావు రమేష్- పవిత్ర లోకేష్-బ్రహ్మాజీ- సప్తగిరి తదితరులు
ఛాయాగ్రహణం - మనోజ్ పరమహంస
కూర్పు - ఎం.ఆర్.వర్మ
సంగీతం - యస్.యస్.థమన్
కథ-మాటలు: కోన వెంకట్ - గోపీ మోహన్
నిర్మాత: దానయ్య డి.వి.వి.
మూలకథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం- శ్రీను వైట్ల
గత ఏడాది దసరా సీజన్ లో శ్రీను వైట్ల 'ఆగడు'తోనూ... రామ్ చరణ్ ' గోవిందుడు అందరి వాడేలే'తోనూ బరిలోకి దిగారు. అయితే ఇద్దరికీ ఆశించిన విజయాలైతే దక్కలేదు. కట్ చేస్తే.. ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని... ఈ దసరా సీజన్ కి ఇద్దరూ కలిసి 'బ్రూస్ లీ' (ది ఫైటర్) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ ఐదు నిమిషాల పాటు కనిపిస్తున్నాడని చెప్పడంతో మరింత క్రేజ్ పెరిగింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!
కథ:
హీరో కార్తీక్ (రామ్ చరణ్) కుటుంబం కోసం ప్రాణాలైనా ఇచ్చే రకం. కార్తీక్ తండ్రి రామచంద్రరావు (రావు రమేష్)కి కొడుకుని కలెక్టరు చేయాలని ఆశ. అది కుదరక కూతురు (కృతి కర్బందా)ని కలెక్టరు చదువు చదివిస్తాడు. అయితే ఫ్రెండు చెల్లెలిని రక్షించడం కోసం పోలీసు డ్రెస్సులో వెళ్లిన కార్తీక్ ని నిజమైన పోలీసనుకుని అతనికి దగ్గరవుతుంది రియా (రకుల్ ప్రీత్ సింగ్). రకుల్ అత్యుత్సాహం వల్ల కార్తీక్ విలన్ల ఆస్తులు ధ్వంసం చేయాల్సి వస్తుంది. దీంతో వారికి అతను టార్గెట్ అవుతాడు. అయితే అనుకోకుండా వాళ్లు తన అక్కకు కూడా హాని తలపెడతారు. దీంతో అటు అక్క కోసం, ప్రియురాలి కోసం విలన్ లను ఎలా ఎదుర్కొంటాడన్నది మిగతా కథ.
కథనం విశ్లేషణ:
దర్శకుడు శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్-గోపీ మోహన్ ల కాంబినేషన్ లో సినిమా 'బ్రూస్ లీ' సినిమా తెరకెక్కుతోంది అంటేనే.. మరో బ్లాక్ బస్టర్ ఖాయమని మెగా అభిమానులతో పాటు సామన్య ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే సినిమా చూసిన తరువాత ప్రతి ఒక్కరూ మరోసారి దర్శకుడు శ్రీను వైట్ల... రెగ్యులర్ ఫార్మాట్ నే నమ్ముకుని తీసిన సినిమా అనిపిస్తుంది. కథలో కొత్తదనం లేదు.
మనం ఇంతకు ముందు చాలా సినిమాలు ఇలాంటి కథతో తెరకెక్కడం చూశాం. శ్రీను వైట్ల ‘దూకుడు’లో ఫాదర్ సెంటిమెంట్ తో విలన్ల ఆటకట్టిస్తాడు. ఇందులో సిస్టర్ సెంటిమెంట్ తో విలన్ల భరతం పడతాడు. ఏదో ఒక సెంటిమెంట్ ను బేస్ చేసుకుని దాని చుట్టూ కథ అల్లుకుని తీసిన సాధారణ సినిమా ఇది. గతంలో అర్జున్ సినిమాలో మహేష్, కళ్యాణ్ రామ్ కత్తి మూవీలో చేసిన సిస్టర్ సెంటిమెంట్ క్యారెక్టర్లు మనకు గుర్తొస్తాయి.
సిస్టర్ సెంటిమెంట్ బాగానే వుంది కానీ.. దాన్ని ముందుకు నడిపించడానికి రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం రొటీన్ గా వుంది. ఇంతకు ముందు శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు, బాద్ షా ల సినిమాల్లో రాసుకున్న సీన్లే ఇందులోనూ పునరావృతమయ్యాయి. శ్రీను వైట్ల అటు తిరిగి ఇటు తిరిగి బ్రహ్మానందాన్ని వాడుకుని విలన్ ఆట కట్టించే అరిగిపోయిన ఫార్ములా దగ్గరికే రావడం నిరాశ పరిచే విషయం. పైకి మంచోడిగా నటించే విలన్ నిజస్వరూపం బయటకు రప్పించేందుకు హీరో కార్తీక్.. సుజికి సుబ్రమణ్యం(బ్రహ్మానందం)ను వాడుకోవడం.. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాల్లో కామెడీ పండినా.. ఇంతకు ముందు ఇలాంటి సీన్లు చూసిన ఫీలింగ్ వెంటాడుతుంది.
ఫస్టాఫ్ మొత్తం విలన్లు చేసే అంసాంఘిక కార్యకలాపాలను ఆటకట్టించే పాత్రలో రామ్ చరణ్ పాత్రను బాగానే రాసుకున్నారు. తన ప్రమేయం లేకుండానే హీరోయిన్ కోసం.. హీరో చేసే కొన్ని సాహసాలు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయిపోతాయి. విలన్ దీపక్ రాజ్(అరుణ్ విజయ్)చేసే చీకటి వ్యాపారాల గుట్టు రట్టు చేసేందుకు రాసుకున్న సన్నివేశాలు బావున్నాయి. సెకెండాఫ్ లో హీరోను విలన్ కంపెనీలోనే ఉద్యోగిగా ఎంటర్ చేయించి.. అక్కడే వుంటూ మెయిన్ విలన్ నిజస్వరూపం బయటపెట్టడానికి వేసిన ప్లాన్లన్నీ ఓ మాదిరిగా వున్నాయి. ద్వితీయార్థం చాలా భాగం ఫ్లాట్ గా సాగుతుంది. కేవలం కామెడీతో నడిపించాలని చూశాడు. అయితే ఇక్కడే కథనం గాడితప్పింది.
ప్రీ క్లైమాక్స్ లో నదియా కుటుంబాన్ని చంపడానికి విలన్ వేసే స్కెచ్.. ఆ తరువాత వారిన హీరో బోటులో కాపాడే సీన్లు బాగానే వున్నా.. హీరో ఉన్నట్టుండి హెలీక్యాప్టర్ లో నుంచి స్టీమరులోకి దూకడం అంతా అతిశయోక్తిలా అనిపిస్తుంది. ఇక అప్పటికే దాదాపు సినిమా కంప్లీట్ అవుతూ వుంటుంది. ఇంకా చిరంజీవి రావట్లేదు ఏంటా అని ఎదురు చూస్తున్న సమయంలో చిరు క్లైమాక్స్ లో ఎంట్రీ ఇస్తాడు. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు మరో సన్నివేశాన్ని కోరుకోకుండా.. చిరు ఫైటింగ్ తోనే సినిమాను ముగించాడు వైట్ల. క్లైమాక్స్ భారీగా లేకపోయినా.. చిరంజీవి మార్కు ఫైట్ ను పెట్టేసి.. మెగా అభిమానులు హ్యాపీగా ఇంటికి వెళ్లేలా చేశాడు దర్శకుడు. చిరు ఐదు నిమిషాలకు పైగానే కనిపించాడు. ఈ మూవీలో రామ్ చరణ్ తో 'ఎలగెలాగ' అంటూ ఓ డైలాగు పలికించాడు దర్శకుడు. అది బాగుంది. చివరకు చిరంజీవి కూడా రకుల్ తో అదే డైలాగ్ అనడం మరింత ఆకట్టుకుంటుంది.
నటీనటులు:
కుటుంబం కోసం పాటు పడే ఓ మిడిల్ క్లాస్ యువకుని పాత్రలో రామ్ చరణ్ బాగా నటించాడు. గతంలో మగధీర సినిమాలో ఎలాగైతే కనిపించాడో ఇందులోనూ అదే ఛాయలు కనిపిస్తాయి. సెంటి మెంట్ సీన్లలో బాగా చేశాడు. రావు రమేష్ ను కౌగిలించుకునే సీన్లో చరణ్ మెచ్యూర్డ్ గా నటించాడు. డ్యాన్సులు, ఫైట్లలో ఎప్పట్లాగే అదరగొట్టేశాడు. ఫ్లూట్ స్టెప్ బాగుంది. విలన్ గా చేసిన అరుణ్ విజయ్ ది అంత గొప్ప పాత్రేమీ కాదు. అతడి నటన కూడా మామూలుగానే ఉంది.రకుల్ గ్లామర్ విషయంలో రెచ్చిపోయింది కానీ.. నటన పెద్దగా ఆకట్టుకోదు. సంపత్ రాజ్ ఇందులో రెండు వేరియేషన్స్ వున్న పాత్రలో నటించి మెప్పించాడు. బ్రహ్మానందం క్యారెక్టర్ రొటీనే కానీ.. బాగానే నవ్వించాడు. పీకేగా ఆలీ ఓ సీన్లో తళుక్కున మెరిసి తన మార్కు కామెడీతో నవ్వించాడు. రావు రమేష్ హీరో తండ్రిగా తన పాత్రకు న్యాయం చేశాడు. బాలీవుడ్ నటి టిస్కా చోప్రాది నెగిటివ్ షేడ్స్ వున్న పాత్ర. నటించడానికి ఆమెకు స్కోప్ వున్నా.. సరిగా ఉపయోగించుకోలేదు. దియా వసుంధరగా కీ రోల్ పోషించింది. ద్వితీయార్థం మొత్తం ఆమె చుట్టూనే కథ తిరుగుతుంది. ఆమె బాగా నటించింది. ద్విపాత్రాభినయంలో కమెడీయన్ కమ్ విలన్ జయప్రకాష్ రెడ్డి బాగా చేశాడు. పోసాని కృష్ణ మురళి - పృథ్వీ - బ్రహ్మాజీ - సత్యం రాజేష్ తమకిచ్చిన క్యారెక్టర్లకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం:
దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాకు మూల కథ అందించినా... దాన్ని తీర్చిదిద్దింది రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్. ఎప్పటిలాగే తమ మార్క్ ఎంటర్ టైన్ మెంట్ ను బేస్ చేసుకుని రాసుకున్న కథను యాజిటీజ్ గా తెరకెక్కించారు. ప్రతి క్యారెక్టర్ కూ జస్టిఫై చేస్తూ సినిమాను తీర్చి దిద్దారు కానీ.. సినిమాలో అనుకున్నంత కామెడీ అయితే లేదు. గతంలో శ్రీను వైట్ల సినిమాల్లో కనిపించేత హిలేరియస్ కామెడీ అయితే పండలేదు. సినిమా నిడివి 155 నిమిషాలు. ఇందులో చాలా భాగం డ్రాగ్ అయింది. దాంతో అక్కడక్కడ చాలా స్లోగా సినిమా సాగుతుంది. ఆ సీన్లన్నింటినీ ట్రిమ్ చేస్తే నిడివి మరింత తగ్గుతుంది. సంభాషణలు పర్వాలేదు. తమన్ మ్యూజిక్ బాగుంది. మూడు పాటలు బాగున్నాయి. చిరంజీవి కనిపించిన క్లైమాక్స్ ఎపిసోడ్ కి ఆర్.ఆర్.బాగా కుదిరింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. పాటల పిక్చరేజేషన్ ఆకట్టుకుంటుంది. నిర్మాత దానయ్య ఎక్కడా రాజీ పడకుండా సినిమాకు ఖర్చు పెట్టాడు.
చివరగా: మళ్లీ అదే రొటీన్ ‘వైట్ల-కోన’ మార్కు సినిమా.
రేటింగ్: 2.75/5
#Brucelee, #Bruceleemovie, #RamcharanBrucelee, #BruceleeReview, #Bruceleerating, #Bruceleetalk, #Ramcharan, #Rakulpreetsingh
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre