ఆర్జీవీ ఏం చేసినా ఏం మాట్లాడినా అది సంచలనమే. నిరంతరం ఏదో ఒక వివాదంతో అంటకాగడం చాలా కామన్. ముఖ్యంగా తన సినిమాల ప్రచారం కోసం ఆర్జీవీ గిమ్మిక్కులు రెగ్యులర్ గా చూస్తున్నవే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చిత్రం `లడ్కీ: ఎంటర్ ది గర్ల్ డ్రాగన్` జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా పలు మీడియా ఇంటర్వ్యూల్లో ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ వేడెక్కిస్తున్నాడు వర్మ.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ బ్రూస్ లీ పై తనకున్న అభిమానం గురించి మాట్లాడాడు. లెజెండరీ మిక్స్డ్-మార్షల్ ఆర్ట్స్ నటుడు బ్రూస్ లీ పై తనకున్న ప్రేమ గౌరవం గురించి ఎమోషనల్ గా మాట్లాడాడు.
బ్రూస్ లీ వ్యక్తిత్వం.. అతని స్క్రీన్ ప్రెజెన్స్ .. అతని కళ్లతో ప్రేమలో ఉన్నానని ఆర్జీవీ పేర్కొన్నాడు. నేను ముద్దు పెట్టుకోవాలనుకున్న ఏకైక వ్యక్తి బ్రూస్ లీ.. అలాగని నేను స్వలింగ సంపర్కుడిని కాను! అని వ్యాఖ్యానించారు.
బ్రూస్ లీలో చాలా భిన్నమైన విషయం ఉంది. అది అతని వేగం మాత్రమే కాదు.. అది అతని శక్తి మాత్రమే కాదు. పంచింగ్ పవర్ లో 10-15 శాతం కంటే ఎక్కువ వ్యత్యాసం ఉందని నేను నమ్మను. ఇది అతని వ్యక్తిత్వం.. ఇది అతని స్క్రీన్ ప్రెజెన్స్.. ఇది అతని కళ్ళు. అతను తన లోని శక్తిని అర్థం చేసుకున్నాడు.
అతను తన పంచ్ లకు రియాక్ట్ అయ్యే సమయాన్ని ప్రేక్షకులకు ఇస్తాడు. అతను వాటిని ఆనందించేలా చేస్తాడు.. అంటూ ఎమోషనల్ గా స్పీచ్ ఇచ్చాడు ఆర్జీవీ. 1973లో బ్రూస్ లీ చిత్రం `ఎంటర్ ది డ్రాగన్` తనను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి కారణమైందని.. అలాగే ఇప్పుడు సినిమా చేయడానికి ప్రేరణనిచ్చిందని తెలిపాడు. వాస్తవానికి పూజా బాలేకర్ తో తాజా సినిమా టైటిల్ కి బ్రూస్ లీ `ఎంటర్ ది డ్రాగన్` స్ఫూర్తి.
ప్రస్తుతానికి ఆర్జీవీ తన తదుపరి చిత్రం `లడ్కీ: ఎంటర్ ది గర్ల్ డ్రాగన్`ని జూలై 15న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం తాప్సీ పన్ను `శభాష్ మిథు`తో పోటీపడి విడుదలవుతోంది. భారత దిగ్గజ క్రికెటర్ బయోపిక్. మిథాలీ రాజ్ బయోపిక్ శభాష్ మిథు. రాజ్‌కుమార్ రావ్ - సన్యా మల్హోత్రా `హిట్: ది ఫస్ట్ కేస్` కూడా విడుదలవుతోంది. అమితాబ్ బచ్చన్ ఇటీవల తన ట్విట్టర్ హ్యాండిల్ లో ‘లడ్కీ: ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ గురించి ట్వీట్ చేసారు.