ఉప్పెన 2 గురించి బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Update: 2021-10-23 01:30 GMT
మెగా హీరో వైష్ణవ్ తేజ్‌ ను ఉప్పెన సినిమాతో పరిచయం చేసి.. మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్‌ లో వైష్ణవ్‌ తేజ్‌ ను చేర్చిన దర్శకుడు బుచ్చిబాబు. సుకుమార్‌ శిష్యుడు అయిన బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో అనూహ్యంగా టాలీవుడ్‌ లోకి దూసుకు వచ్చాడు. టాలీవుడ్‌ లో ఇప్పటి వరకు ఏ హీరో లేదా దర్శకుడి మొదటి సినిమాకు వంద కోట్ల వసూళ్లు వచ్చిన దాఖలాలు లేవు. అలాంటి అరుదైన రికార్డును దక్కించుకున్న బుచ్చి బాబు దృష్టిలో ఉప్పెన 2 కథ ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఉప్పెనకు ముందు ఉప్పెన 2 కథను అనుకున్నట్లుగా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఉప్పెన సినిమా కథ కు కొనసాగింపుగా ఉండే ఉప్పెన 2 కథ కేవలం పాన్ ఇండియా కథ మాత్రమే కాదని.. అదో పాన్ వరల్డ్‌ కథ గా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. గ్లోబల్‌ కాన్సెప్ట్‌ అంటూ బుచ్చి బాబు ఉప్పెన 2 పై అంచనాలు భారీగా పెంచేశాడు. ఎప్పుడు ఉంటుంది.. ఎలా ఉంటుంది అనే విషయమై క్లారిటీ ఇవ్వలేదు... కాని ఖచ్చితంగా ఉప్పెన 2 ను గ్లోబల్ మూవీగా తీర్చిదిద్దడం ఖాయం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా ఉప్పెన 2 సినిమాను చేస్తానంటున్న బుచ్చి బాబు అంచనాలు అమాంతం పెంచేశాడు.

వైష్ణవ్‌ తో తెరకెక్కించిన మొదటి సినిమా ఉప్పెన తర్వాత బుచ్చి బాబుకు రెండవ సినిమా ఆఫర్‌ గా ఎన్టీఆర్‌ ను డైరెక్ట్‌ చేసే అవకాశం వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. బుచ్చి బాబు దర్శకత్వంలో ఎన్టీఆర్‌ సినిమా ఎప్పుడెప్పుడు ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గురువు లాగే ఒక మంచి జెన్యూన్‌.. జీనియస్ డైరెక్టర్‌ గా బుచ్చి బాబుకు పేరు మొదటి సినిమాతోనే వచ్చింది. కనుక ఖచ్చితంగా బుచ్చి బాబుతో ఎన్టీఆర్‌ సినిమా చేస్తే తప్పకుండా మంచి సినిమా గా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఉప్పెన 2 కంటే ముందు ఎన్టీఆర్‌ తో సినిమా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి అసలు విషయం ఏంటీ అనేది బుచ్చి బాబు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Tags:    

Similar News