కరోనా మహమ్మారీ క్రైసిస్ లోనూ కాసుల వర్షం కురిపించి పరిశ్రమ వర్గాల్ని ఆశ్చర్యపరిచిన క్రేజీ మూవీ `ఉప్పెన`. ఓవైపు కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నా కానీ యువజనం దేనినీ ఖాతరు చేయక ఈ మూవీని చూసేందుకు థియేటర్లకు వచ్చారు. ఉప్పెన బాక్సాఫీస్ వద్ద 100కోట్ల క్లబ్ చిత్రంగా సంచలనం సృష్టించింది. డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ అప్పటివరకూ ఉన్న రికార్డులన్నిటినీ తిరగరాసాడు. దేశంలోనే ఉత్తమ డెబ్యూ హీరోగా రికార్డులకెక్కాడు. ఉత్తమ డెబ్యూ దర్శకుడిగా బుచ్చి బాబు సన.. ఉత్తమ డెబ్యూ నాయికగా కృతి శెట్టి పేర్లు మార్మోగాయి.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన బుచ్చిబాబు సనా ప్రతిభకు ప్రముఖుల నుంచి ప్రశంసలు కురిసాయి. డెబ్యూ నాయిక కృతి శెట్టి నటనకు గొప్ప ఫాలోయింగ్ పెరిగింది. ఒక్క బ్లాక్ బస్టర్ తో ఆ ముగ్గురికీ క్రేజీ ఆఫర్లు క్యూ కట్టాయి. వైష్ణవ్ తేజ్ ఘనమైన ఆరంగేట్రానికి మెగా కాంపౌండ్ ఆనందం వ్యక్తం చేసింది.
అయితే ఈ చిత్రానికి వైష్ణవ్ తేజ్ మొదటి ఎంపిక కాదనేది తెలిసింది తక్కువ మందికే. తాజాగా ఓ చిట్ చాట్ లో బుచ్చిబాబు సన మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్ర పోషించాలని తాను కోరుకున్నానని అతడి కోసమే కథను కూడా రాశానని బుచ్చి బాబు సనా చెప్పారు. దీనిని బట్టి వైష్ణవ్ అనూహ్యంగా తెరపైకొచ్చాడని భావించవచ్చు.`అర్జున్ రెడ్డి` రిలీజయ్యాక అనూహ్యంగా విజయ్ ఇమేజ్ మారడంతో తాను మనసు మార్చుకుని కొత్తకుర్రాడు వైష్ణవ్ తేజ్ ని సంప్రదించాడట. మైత్రి మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.