రష్మిక మందన్నకు 'గీత గోవిందం' సమయంలో యూత్ లో మంచి క్రేజ్ ఉండేది. అయితే తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడం.. కొన్ని వివాదాలు నెలకొనడంతో క్రేజ్ కొంత తగ్గిన మాట వాస్తవం. అయితే వాటితో సంబంధం లేకుండా రష్మికకు స్టార్ హీరోలు నటించే క్రేజీ ప్రాజెక్టులలో హీరోయిన్ ఆఫర్లు వస్తున్నాయి. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'పుష్ప' లో రష్మిక హీరోయిన్ గా నటిస్తోందని సంగతి తెలిసిందే. మైత్రీ వారు 'డియర్ కామ్రేడ్' సమయంలో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా హీరోయిన్ గా ఎంచుకున్నారు.
అయితే ఈ సినిమాలో రష్మిక నటించడం విషయంలో అల్లు అర్జున్ ఫాన్స్ కొందరు ఆసక్తిగా లేరు. దీనికి వారు రెండు మూడు కారణాలు చెప్తున్నారు. అందులో ఒకటి ఏంటంటే.. ఈమధ్య రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా 'సరిలేరు నీకెవ్వరు' లో రష్మిక నటన అదోరకంగా అనిపించింది. అల్లరిపిల్లగా నటించడానికి అతి చేయడానికి తేడా తెలియకుండా నటించిందని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అలాంటిది ఇప్పుడు 'పుష్ప' లో ఇంటెన్స్ రోల్ లో నటించగలదా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరో కారణం ఏంటంటే రష్మిక ప్యాన్ ఇండియా సినిమాలకు అచ్చిరాదని.. 'డియర్ కామ్రేడ్' దానికో ఉదాహరణ అని అంటున్నారు. ఆ సినిమా అన్ని భాషల్లో దారుణ పరాజయం నమోదు చేసింది.
ఇంకో విషయం ఏంటంటే రష్మిక కన్నడ అమ్మాయి అయినప్పటికీ కర్ణాటకలో తనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కన్నడ మాట్లాడడం రాదని గతంలో వ్యాఖ్యానించడం.. కన్నడ సినిమాలకు ప్రాధాన్యతనివ్వకుండా ఇతర భాషలకు ప్రాధాన్యతనివ్వడం పట్ల అక్కడివారు రష్మికపై గుర్రుగా ఉన్నారు. 'డియర్ కామ్రేడ్' కు కర్ణాటకలో మినిమమ్ కలెక్షన్స్ కూడా రాకపోవడానికి రష్మిక పట్ల వున్న వ్యతిరేకతే కారణం అని ఒక టాక్ ఉంది. ఇన్ని కారణాలు ఉండడంతో రష్మిక ఈ సినిమా కు మైనస్ గా మారే అవకాశం ఉందని అంటున్నారు. అయితే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ల కొరత ఉండడంతో సుకుమార్ రష్మికను ఎంచుకోక తప్పలేదని.. బన్నీకి కూడా వేరే మంచి ఆప్షన్ లేక పోవడంతోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రష్మిక ఎలా నెట్టుకొస్తుందో వేచి చూడాలి.