టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఇతర భాషల్లోనూ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. 'పుష్ప: ది రైజ్' సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిన బన్నీ.. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాడు. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఇందులో పుష్పరాజ్ గా అతని పెర్ఫార్మన్స్ కు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో బన్నీ కి అక్కడ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్టార్ హీరో నేరుగా హిందీ సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి.
తెలుగు సినిమా మార్కెట్ అన్ని భాషల్లో విస్తరించిన తర్వాత ప్రతీ టాలీవుడ్ హీరో కూడా ఇప్పుడు పాన్ ఇండియా జపం చేస్తున్నారు. కేవలం మాతృ భాషకే పరిమితం కాకుండా.. హిందీలోనూ సత్తా చాటాడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు స్ట్రెయిట్ హిందీ సినిమాలు చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి అగ్ర హీరోలు కొందరు మాత్రం ఆ వైపు చూడటం లేదు. దీనికి తగ్గట్టుగానే ఇటీవల 'బాలీవుడ్ నన్ను భరించలేదు' అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన సంగతి తెలిసిందే.
ఇదే విషయం మీద అల్లు అర్జున్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. హిందీలో నటించడం తన కంఫర్ట్ జోన్ లో లేదని అన్నారు. కాకపోతే బాలీవుడ్ సినిమాలో నటించడానికి తనకు అభ్యంతరం లేదని పేర్కొన్నాడు. "హిందీలో నటించడం ప్రస్తుతానికి నా కంఫర్ట్ జోన్ కు కొద్దిగా దూరంగా ఉంది. కానీ ఖచ్చితంగా కథ బావుండి తప్పనిసరి అనిపిస్తే చేస్తాను" అని ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ చెప్పినట్లు తెలుస్తోంది.
“ఇప్పటికే ఒక ఆఫర్ వచ్చింది. కథ చాలా సాదా సీదాగా ఉంది. ఎగ్జైటింగ్ ఏమీ అనిపించలేదు. అందుకే సున్నితంగా తిరస్కరించాను. రొటీన్ కథలు కాకుండా మంచి కథలు వస్తే హిందీలో త్వరలోనే నటిస్తానని అనుకుంటున్నాను. కానీ, అక్కడ నటించాలంటే ఎంతో ధైర్యం కావాలి. మరొక భాషలో సినిమా చేయడానికి మీరు మరింత రిస్క్ చేయాలి” అని బన్నీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా హిందీ సినిమాల్లో సెకండ్ హీరోగా చేయడం తనకు ఇష్టం లేదని అల్లు అర్జున్ స్పష్టం చేశాడు.
ఇకపోతే అల్లు అర్జున్ ఇప్పుడు ‘పుష్ప ది రూల్’ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నద్ధం అవుతున్నారు. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. ఆగస్టు రెండో వారంలో సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
'పుష్ప 2' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించనున్నారు. మొదటి భాగానికి వచ్చిన అనూహ్య స్పందన మరియు సెకండ్ పార్ట్ పై అంచనాలను దృష్టిలో పెట్టుకొని భారీ స్థాయిలో రూపొందనున్నారు. ముఖ్యంగా హిందీ మార్కెట్ పై ఫోకస్ చేసి స్క్రిప్టులో పలు మార్పులు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.