బన్నీ నెక్ట్స్‌ ఏంటీ సస్పెన్స్ కంటిన్యూ

Update: 2021-10-24 05:36 GMT
అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. పుష్ప రెండు పార్ట్‌ లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అయితే మొదటి పార్ట్ కు మరియు రెండవ పార్ట్‌ కు మద్య మరో సినిమాను బన్నీ చేసే అవకాశాలు ఉన్నాయని.. అది వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఐకాన్ అయ్యి ఉంటుంది అంటూ మొన్నటి వరకు మీడియాలో మరియు మెగా వర్గాల్లో టాక్‌ వినిపించింది. కాని ఇప్పుడు ఐకాన్‌ సినిమా ను బన్నీ చేసే ఉద్దేశ్యంలో ఉన్నాడా లేడా అనే చర్చ మొదలు అయ్యింది. ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన ఐకాన్‌ సినిమాను బన్నీ ఎప్పటికి మొదలు పెట్టబోతున్నాడు అనే విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. పుష్ప పార్ట్‌ 1 ముగింపు దశకు వచ్చింది. కాని ఎక్కడ కూడా ఐకాన్‌ చర్చ కనిపించడం లేదు. బన్నీ సన్నిహితులు మరియు దిల్‌ రాజు కాంపౌండ్‌ కూడా ఐకాన్‌ గురించిన అధికారిక ప్రకటన ఏదీ చేయడం లేదు.

ఈ సమయంలోనే బన్నీ తదుపరి సినిమా విషయంలో అల్లు అరవింద్‌ మరియు బన్నీ వాసులు స్పందిస్తూ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ఉంటుంది అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఒక సినిమా పట్టాలెక్కబోతుందని బన్నీ వాసు అండ్ టీమ్‌ చెబుతున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా ను వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటూ మెగా వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే బన్నీతో సరైనోడు సినిమాను చేసిన బోయపాటి ఈసారి అంతకు మించి అన్నట్లుగా భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ ను చేయబోతున్నట్లుగా అభిమానులు నమ్ముతున్నారు. బోయపాటి మరియు బన్నీల కాంబో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బోయపాటి సినిమా తర్వాత ఐకాన్ సినిమా ఉంటుందా అంటే అది కూడా నమ్మకం తక్కువే అన్నట్లుగా మెగా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బన్నీ తదుపరి సినిమాల క్యూలో ప్రశాంత్ నీల్‌.. మురుగదాస్ తో పాటు మరో ప్రముఖ దర్శకుడు కూడా ఉన్నారు. కనుక ఐకాన్‌ సినిమా విషయం అనుమానమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు టార్గెట్‌ గా బన్నీ తన ప్రతి సినిమా పై కూడా చాలా ఎక్కువ శ్రద్ద పెడుతున్నాడు. నాపేరు సూర్య సినిమా తర్వాత బన్నీ సినిమాల ఎంపిక చేసుకునే విధానం చాలా మార్పు వచ్చింది. అందుకే ఐకాన్‌ సినిమా విషయంలో కాస్త ఎక్కువగా ఆలోచిస్తున్నాడనే టాక్‌ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. త్వరలోనే ఐకాన్‌ గురించిన ఒక నిర్ణయానికి బన్నీ వస్తే దర్శకుడు వేణు శ్రీరామ్‌ నెక్ట్స్‌ స్టెప్ తీసుకుంటాడు. అందుకే అభిమానులు బన్నీ నెక్ట్స్ ఏంటీ అంటూ ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు.
Tags:    

Similar News