మెగా వేడుకకు బన్నీ డుమ్మా.. కారణం అదేనా..?

Update: 2021-08-24 06:37 GMT
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. రాఖీ పండగ - చిరు బర్త్ డే రెండు పండుగలు ఒకేసారి రావడంతో మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. మెగా బంధువులందరూ చిరంజీవి ఇంట్లో చేరి సందడి చేశారు. మెగా బ్రదర్స్‌ కు రాఖీ కట్టిన ఆడపడుచులు వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలానే బిగ్ బాస్ తో కేక్‌ కట్‌ చేయించి బర్త్ డే ని సెలబ్రేట్‌ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. మెగా ఫ్యామిలీ అంతా ఒకచోట చేరి సంబరాలు చేసుకోవడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అయితే ఇందులో అల్లు అర్జున్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

చిరంజీవి పుట్టిన రోజు వేడుకలలో మెగా బ్రదర్స్ పవన్‌ కల్యాణ్‌ - నాగబాబు.. కొడుకు కోడలు రామ్‌ చరణ్‌ - ఉపాసన.. కూతుళ్లు సుస్మిత - శ్రీజ.. అల్లుళ్లు విష్ణు - కళ్యాణ్ దేవ్.. చిరంజీవి చెల్లెల్లు.. మనవరాళ్లు.. మెగా మేనల్లుళ్లు సాయి తేజ్‌ - పంజా వైష్ణవ్‌ తేజ్‌.. మెగా డాటర్ నిహారిక దంపతులు.. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ హాజరయ్యారు. అలానే చిరంజీవి బావమరిది అల్లు అరవింద్‌ కూడా సతీసమేతంగా ఈ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. అల్లు శిరీష్ కూడా మెగాస్టార్ ని కలిసి విషెస్ అందించారు. అయితే గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకల్లో అల్లు అర్జున్‌ ఫ్యామిలీ మాత్రం ఎక్కడా కనిపించలేదు.

మెగా కార్యక్రమంలో బన్నీ కనిపించకపోవడంపై కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్.. వేడుకలకు ఎందుకు డుమ్మా కొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. ఎల్లప్పుడూ తన చర్యలతో ప్రత్యేకంగా నిలిచే స్టైలిష్ స్టార్.. ఇప్పుడు చిరు బర్త్ డే లో కనిపించకపోవడం చర్చనీయాంశం అయింది. గతంలో పలు సందర్భాల్లో మెగా ఫ్యామిలీ అని కాకుండా.. అల్లు ఫ్యామిలీ అనుకునేలా బన్నీ వ్యవహరిస్తున్నారనే రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే.  

అయితే అల్లు అర్జున్ 'పుష్ప' షూటింగ్ లో బిజీగా ఉండటం వల్లనే మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు వెళ్లలేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆదివారం ఉదయాన్నే చిరుకు స్వయంగా విషెస్ అందించి షూటింగ్ కి వెళ్లారని అంటున్నారు. అదే నిజమైతే బన్నీ భార్య స్నేహా రెడ్డి అయినా ఈ వేడుకల్లో కనిపించాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా మెగా కార్యక్రమంలో అల్లు అర్జున్‌ లేకపోడం వెలితిగా అనిపించిందని అభిమానులు అంటున్నారు. చిరు - పవన్ - చరణ్ లతో పాటుగా బన్నీ కూడా ఉంటే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News